బిజినెస్‌మ్యాన్‌తో టెలివిజన్ నటి రెండో పెళ్లి.. యువ యాక్టర్‌కు విడాకులు ఇచ్చి..
ప్రముఖ టెలివిజన్ తార రెండో వివాహానికి సిద్దమైంది. ఆమె పెళ్లి వార్త ప్రస్తుతం జాతీయ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గత కొద్దికాలంగా తన భర్తకు విడాకులు ఇచ్చిన నటి.. ఓ వ్యాపారవేత్తతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే వార్తలు మీడియాలో గుప్పమన్నాయి. అయితే యువ టెలివిజన్ నటి పెళ్లి వార్త కన్ఫార్మ్ కావడంతో రూమర్ల వ్యాప్తికి ఎండ్ కార్డు పడింది. అయితే మొదటి భర్త ఎవరు? ఎందుకు విడాకులు ఇచ్చారు? రెండో భర్త ఎవరు కాబోతున్నారు. వారి పెళ్లి ఎప్పుడనే వివరాల్లోకి వెళితే..
జెన్నిఫర్ వింగెట్ ఈ పేరు వినగానే హాలీవుడ్ నటి అనుకొంటే తప్పులో కాలేసినట్టే.. అచ్చమైన భారతీయ నారి. అయితే తల్లి హిందువు, తండ్రి క్రిస్టియన్ కావడంత తండ్రి మతం ప్రకారం ఆమె జెన్నిఫర్ వింగెట్‌గా తన పేరును కొనసాగించారు. అయితే దిల్ మిల్ గయే, బేహద్, బెపన్నా, సరస్వతిచంద్ర, కసౌటీకి జిందగీ కి అనే సీరియల్స్ ద్వారా ఆమె విశేషంగా బుల్లితెర అభిమానులను ఆకట్టుకొన్నారు. ఆమె నటనతో బుల్లితెర నటిగా పాపులర్ అయ్యారు. ఆ సమయంలోనే సహచర నటుడు, దిల్ మిల్ గయే ఫేమ్ కరణ్ సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడింది.

దిల్ మిల్ గయే షూటింగులో జరిగిన పరిచయం జెన్నిఫర్, కరణ్ సింగ్‌ను సన్నిహితంగా మార్చింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇరు కుటుంబాలు సమ్మతి తెలపడంతో వారిద్దరూ 2012 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితం రెండేళ్లు బాగానే జరిగింది. సవ్యంగా సాగుతున్న వారి కాపురంలో కలతలు చెలరేగడం, అవి పరిష్కరించుకోలేనంతగా మారడంతో 2014 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత కరణ్ గ్రోవర్ ప్రముఖ హీరోయిన్ బిపాస బసును వివాహం చేసుకోవడం తెలిసిందే.
అయితే కరణ్ గ్రోవర్‌తో విడాకుల తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ అనేక రూమర్లకు దారి తీసింది. కానీ ఆవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోవడంతో తరుచు డేటింగ్ వార్తలతో వార్తల్లో కనిపించారు. అయితే ఇటీవల ఓ వ్యాపారవేత్తతో చనువుగా ఉంటారనే వార్త ఆమె డేటింగ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. సింగపూర్‌కు చెందిన పారిశ్రామిక వేత్త విలియం ఇషామెల్‌తో సన్నిహితంగా ఉండటం సోషల్ మీడియాలో బట్టబయలైంది. అయితే వారిద్దరూ కొంతకాలంగా లోప్రొఫైల్‌లో అఫైర్ కొనసాగిస్తున్నారు.
అయితే కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న జెన్నిఫర్ ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కోసం సింగపూర్ వెళ్లి విలియంను కలుసుకోవడం జరుగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ వెకేషన్‌కు వెళ్లడంతో వారి బంధం మరింత బలపడింది. ఆ సందర్భంలో విలియం చేసిన మ్యారేజ్ ప్రపోజల్‌ను జెన్నిఫర్ అంగీకరించింది. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలో గానీ వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్త ప్రచారంలో ఉంది. తమ వివాహంపై మౌనంగా ఉన్న వారు అధికారికంగా ప్రకటిస్తే.. వారి పెళ్లి విషయం అఫీషియల్ అవుతుంది.


Click it and Unblock the Notifications