వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి జ్యోతి రాయ్.. టాప్ టీవీ యాక్టర్ ప్రవేశం ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ మొదలై నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా రకరకాల గొడవలతో కనిపిస్తున్నది. అయితే ఈ సీజన్‌లో యూత్‌కు, సీరియల్ యాక్లర్లకు పెద్ద పీట వేశారు. భారీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు షోలోకి వచ్చారు. అయితే రెగ్యులర్ టెలివిజన్ ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. అయితే ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీలను సిద్దం చేస్తున్నది. అయితే సోషల్ మీడియానే కాకుండా తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డు ఎంట్రీతో సిద్దమవుతున్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..
గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడంగా తెలుగు ప్రేక్షకులకు జ్యోతి రాయ్ సుపరిచితుల. చిన్న వయసులోనే తల్లి పాత్రను ధైర్యంగా వేసి ఆడియెన్స్‌ను విశేషంగా ఆదరించడమే కాకుండా భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నారు. అయితే తాజాగా ఆమె తన యంగ్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ పెట్టే వీడియోలు, రీల్స్, స్టేటస్, ఫోటోలు ఆలోచింప జేసేలా, ఆకట్టుకొనేలా ఉంటాయి. తన అందచందాలను, ఘాటైన గ్లామర్‌ను తన ఫ్యాన్స్‌కు అందజేస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో క్రేజీగా మారుతున్నారు. అయితే ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ మధ్యకాలంలోనే దర్శకుడు సుక్కును వివాహం చేసుకొన్న జ్యోతిరాయ్.. తన భర్త రూపొందించే పాన్ ఇండియా మూవీలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే మరో సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్‌ను పోషిస్తున్నారు. అలాగే నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్‌ని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు సంప్రదించారు. కానీ తన షూటింగులో కారణంగా తాను గ్రాండ్ ఓపెనింగ్ రోజున ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. సినిమా షూటింగుల ఉన్నాయి. అవి కంప్లీట్ చేయకుండా రావడం కుదరదని చెప్పినట్టు సమాచారం.
అయితే జగతి మేడమ్ సమాధానం సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీకి ఆఫర్ ఇవ్వగా అందుకు సరేనని అన్నట్టు సమాచారం. అయితే ఈ లోపు షూటింగులు పూర్తి చేసుకొని ఆమె ఇంటిలోకి వెళ్లడానికి ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ అన్నీ సెట్ అయితే..జ్యోతిరాయ్ 4, లేదా 5వ వారంలో ఎంట్రీ ఉండవచ్చనే ఊహాగానాలు మీడియా వర్గాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











