Just In
- 10 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 49 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- News
బిడెన్‌కు అప్పుడే అభిమానులు పుట్టుకొచ్చారు: బాటిల్లో మినియేచర్: ఎవరీ ఈశ్వర్ రావు: గిఫ్ట్‌గా
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్ తెలుగు 4 ఫైనల్‌కు చీఫ్ గెస్ట్ కన్ఫర్మ్.. ఆ స్టార్ హీరోనే వేదికపై.. రచ్చ రచ్చ..
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. అత్యంత పాపులారిటిని సంపాదించుకొన్న ఈ షో ఇంకా రెండు వారాలపాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో ముగింపు వేడుక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నాలుగో సీజన్ క్లోజింగ్ వేడుకకు ఎవరు చీఫ్ గెస్ట్ అనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ముగింపు వేడుకకు ఎవరు ముఖ్య అతిథి అంటే..

బిగ్ బాస్ మూడు సీజన్లకు ముఖ్య అతిథిగా
బిగ్‌బాస్ తెలుగు 1, 2, 3 సీజన్ ముగింపు కార్యక్రమంలో ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శివ బాలాజీకి ఎన్టీఆర్ షీల్డ్ అందంచగా, రెండో సీజన్ విజేత కౌశల్ మండాకు వెంకటేష్ అందించారు. ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు చిరంజీవి ట్రోఫిని అందించారు.

నాలుగో సీజన్‌కు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్
ఇక నాలుగో సీజన్ కోసం ముఖ్య అతిథి ఎవరనే విషయంపై ఇప్పుడు మీడియాలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించినప్పటికి.. క్లారిటీ రాలేదు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నారంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్?
నాలుగో సీజన్ మరో 14 రోజులపాటు సాగనున్నది. ఈ క్రమంలో ముగింపు వేడుకకు ఇప్పటి నుంచే బిగ్‌బాస్ హౌస్‌లో హంగామా కొనసాగుతున్నది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబును కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

డిసెంబర్ 20 తేదీన ఫైనల్
బిగ్‌బాస్ ముగింపు వేడుకు డిసెంబర్ 20వ తేదీన నిర్వహించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు పలువురు ప్రముఖులను, కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా వేడుకను నిరాడంబరంగానే తక్కువ మందితోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.