Bigg Boss; బిగ్ బాస్ 8 హోస్ట్ గా స్టార్ హీరో.. అనూహ్యం గా తెర పైకి!

వరల్డ్ వైడ్ గా మంచి పాపులర్ అయినటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు గాంచిన షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో అనే చెప్పాలి. బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ సంబంధించి చాలా మంది ప్రముఖ తరాల నడుమ జరిగే ఓ రసవత్తర హౌస్ డ్రామాగా మొదలైన ఈ రియాలిటీ షో వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యింది. కాగా ముందు పాశ్చాత్య దేశాల్లో స్టార్ట్ అయ్యిన ఈ షో ట్రెండ్ ఇప్పుడు ప్రపంచ ఎంటర్టైన్మెంట్ లవర్స్ ని రూల్ చేస్తుంది.

ఇలా మన దేశానికి కూడా విస్తరించిన ఈ షో ఇక్కడ కూడా ప్రసారం కబడుతున్న అన్ని భాషల్లో కూడా హిట్ అయ్యింది. అయితే అత్యధికంగా హిందీలో ఈ షో 13కి పైగా సీజన్లు కంప్లీట్ అయితే సౌత్ నుంచి మన తెలుగు సహా తమిళ్ భాషల్లో 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇంచు మించు ఈ రెదను భాషల్లో కూడా ఒకే సమయానికి షోలు మొదలయ్యేలా ఛానెల్స్ వారు ప్లాన్ చేసుకుంటారు.

is makkal selvan vijay sethupathi replaced kamal for bigg boss tamil 8

అలా భాషల్లోని మంచి సక్సెస్ అయ్యిన ఈ గ్రాండ్ రియాలిటీ షో.. తమిళ్ వెర్షన్ కి రీసెంట్ గా షాక్ తగిలింది. ఈ షో మొదటి సీజన్ నుంచి గత ఏడు సీజన్ల వరకు కూడా ఉలగనయగన్ కమల్ హాసన్ నే హోస్ట్ గా చేస్తూ వచ్చి రక్తి కట్టించారు. కానీ ఇపుడు ఎనిమిదవ సీజన్లో మాత్రం తాను కంటిన్యూ అవ్వలేనని చెప్పేసారు. తనకి చేయాల్సిన సినిమాలు ఎక్కువ ఉన్నాయని ఈసారి హోస్ట్ గా చేయలేను అని చెప్పేసరికి తమిళ ఆడియెన్స్ లో ఇప్పుడు ఏ స్టార్ కనిపిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ టాక్ కి గాను ఓ విలక్షణ నటుడు పేరు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఆ నటుడు ఎవరో కాదట నటనలో కమల్ తో పాటుగా తమిళ్ నుంచి మంచి పేరు తెచ్చుకున్న వెర్సటౌల్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ టాక్ లో ఎంతవరకు నిజముందో లేదో కానీ కమల్ కి సేతుపతి పర్ఫెక్ట్ రీప్లేస్ మెంట్ అనే చాలా మంది అంటున్నారు.

is makkal selvan vijay sethupathi replaced kamal for bigg boss tamil 8

మరి నిజంగానే సేతుపతి కమల్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడా లేదా అనేది వేచి చూడాలి. రీసెంట్ గానే విజయ్ సేతుపతి తన 50వ సినిమాగా "మహారాజ" తో తన కెరీర్ లో బిగ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇక మన తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే ఇది కింగ్ నాగార్జున తోనే హోస్ట్ గా కొనసాగనుండగా ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X