Bigg Boss Telugu 8 : మిడ్ వీక్ షాకింగ్ ఎలిమినేషన్..ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గేమ్ ఓవర్
Bigg Boss Telugu 8 Mid Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఓ వైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మరో వైపు డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ లవర్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే .. బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతుంది. 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో వచ్చేందుకు రెడీగా ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయంపైనే జోరుగా చర్చ జరుగుతుంటే.. ఇంతలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటూ మైండ్ బ్లోయింగ్ ప్రకటన చేశాడు కింగ్ నాగార్జున. ఇంతకీ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎవరూ ఎలిమినేట్ కాబోతున్నారో ఓ లూక్కేయండీ.
అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ పేరిట ప్రారంభమైన బిగ్ బాస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సూపర్ ట్వీస్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. హోస్ట్ నాగార్జున చెప్పిన ప్రకారం ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా.. ఆ లెక్కన చూస్తే నేడు అంటే గురువారం నాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సిందే. ఒక్క వేళ బిగ్ బాస్ ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే.. ఎలా చేస్తారు? ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిని ఎలిమినేట్ చేస్తారా? లేదా ప్రస్తుతం జరుగుతున్న టాస్కులను బేస్ చేసుకొని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా? అనేది చర్చనీయంగా మారింది.

మరీ ఎలా అంటే.. ఖచ్చితంగా హౌస్ మెట్స్ నిర్ణయం ప్రకారమే మిడ్విక్ ఎలిమినేషన్ జరిగే అవకాశముంది. వైల్డ్ కార్డు ఎంట్రీ లను ఆపేందుకు జరుగుతున్న టాస్క్ లో పెర్ఫార్మన్స్ ఆధారంగా చేసుకుని ఎవరు అర్హులు? ఎవరు అనర్హులో? చెప్పాలని అన్నప్పుడు హౌస్ మెట్స్ నే అడిగే అవకాశముంది. ఈ క్రమం చూస్తే.. మరో ఆలోచన లేకుండా నాగమణికంఠ పేరు చెప్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఆల్రేడీ యష్మి .. నాగమణికంఠపై మండిపడుతోంది. అలాగే.. పృథ్వి, నిఖిల్ కూడా ఆమె అడుగుజాడల్లో నడున్నారు. కాబట్టి ఆ ముగ్గురు కూడా మణికంఠమే అనే అర్హుడుగా ప్రకటించే అవకాశం ఉంది.
సొంత క్లాన్ లోనే నాగమణికంఠకు సపోర్ట్ దొరకనప్పడూ.. అపోజ్ క్లన్ వారు ఎలా సపోర్టు చేస్తారు. నైనిక, నబిల్ సపోర్టు చేసిన మిగిత కంటెస్టెంట్ల్ నాగమణికంఠపై మండిపడుతున్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ల అభిప్రాయం ప్రకారం.. మణికంఠనే అని అర్హుడుగా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది. బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రకారం.. నాగ మణికంఠ అవుట్. పాపం నాగమణికంఠ ను అనవసరంగా ఎలిమినేట్ చేశారనే సింపతీ మణికంఠకి సింపతీ వస్తుంది. సీజన్ కూడా ఇంట్రెస్టింగ్ మారుతోంది.
ఇలా మణికంఠం టార్గెట్ చేసి అతని ఎలిమినేట్ చేశారు అనే సమయంలో.. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ట్వీస్ట్ ఇస్తారు. అతడ్నీ సీక్రెట్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తే .. బిగ్ బాస్ కి కావలసిన ఫుటేజ్ వస్తుంది. కాబట్టి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటి ? అనేది బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బిగ్ బాస్ కి పవర్ ఫుల్ ఫుటేజ్ కంటెంట్. కాబట్టి.. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే .. కచ్చితంగా నాగమణికంఠ సీక్రెట్ రూమ్ కి పంపించవచ్చు.


Click it and Unblock the Notifications










