Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జడ్జ్ మెంట్ తక్కువ చిందులు ఎక్కువ.. ఆ షోలో మోనాల్ రచ్చ
బిగ్ బాస్ షోలో మోనాల్ ఎలా నెట్టుకువచ్చిందో ఇప్పుడు కూడా అలానే నెట్టుకువస్తోంది. బిగ్ బాస్ షోలో గ్లామర్‌తో దాదాపు వంద రోజులకు పైగా ప్రయాణాన్ని కొనసాగించింది. మోనాల్‌కు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. మెనాల్ బిగ్ బాస్ఇంటిని వీడే సందర్భాలెన్నో వచ్చాయి. కానీ ఆమెకు బదులుగా వేరే వాళ్లంతా ఎలిమినేట్ అయ్యారు. అలా చివరి వారం వరకు మోనాల్ ప్రయాణం కొనసాగింది.
బయటకు వచ్చాక అలా..
ఇక మోనాల్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక మంచి ఆఫర్లే వచ్చాయి. స్టార్ మాతో ముందే ఒప్పందం ఉన్నట్టుంది. అందుకే మోనాల్ బయటకు రాగానే వెంటనే డ్యాన్స్ ప్లస్ షోలో ఆమెను తీసుకున్నారు. అయితే మోనాల్‌కు ఏకంగా జడ్జ్ స్థానాన్ని ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
వారితో పాటు..
డ్యాన్స్ ప్లస్ షోలో బాబా భాస్కర్, యానీ మాస్టర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ ఇలా డ్యాన్సులకు సంబంధించిన వారిని జడ్జ్‌లుగా పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇక ముమైత్ ఖాన్‌ను కూడా పెట్టారు. సరే ముమైత్ ఖాన్ మంచి డ్యాన్సర్ కాబట్టి ఆమెను కూడా తీసుకున్నారు. కానీ మోనాల్‌ను మాత్రం కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్టు కనిపిస్తోంది.
మళ్లీ ఓ ట్రాక్..
ఇక షో ఏదైనా పులిహోర, ట్రాకులు, హగ్గులు ఇవన్నీ కామన్ అని మోనాల్‌కు బాగానే తెలిసినట్టుంది. అందుకు డ్యాన్స్ ప్లస్ షోలోనూ మోనాల్ యశ్ మాస్టర్ల మధ్య మంచి ట్రాకును క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. మోనాల్ కూడా హగ్గుల సంప్రదాయాన్ని ఎలాగూ కొనసాగిస్తూనే ఉంది.
చిందులు ఎక్కువ..
ఇక మోనాల్ డ్యాన్స్ ప్లస్ షోలో కంటెస్టెంట్‌కు ఎక్కువగా జడ్జ్‌కి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు మోనాల్ జడ్జ్ అంటేనే ఏ యాంగిల్లోనూ కనిపించడం లేదు. ఇక మళ్లీ ఆమె రెడ్ గ్రీన్ అని చెప్పడం, ఆమెకంటూ ఓ టీం పెట్టడం అంతా షోను డిజాస్టర్ చేసేందుకు అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ షోకు టీఆర్పీ కూడా ఏమీ రావడం లేదు. అలా మోనాల్ గ్లామర్, అతి చర్యలు కూడా టీఆర్పీని తీసుకురాలేకపోతున్నాయన్న మాట.