నటి తల్లి కాబోతోందంటూ రూమర్స్.. ఆ పద్దతి నాకు ఇష్టం లేదంటూ సమాధానం!
నటి అనిత హస్సానందిని బుల్లితెరపై దూసుకుపోతోంది. అనిత ప్రస్తుతం పలు టివి సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె నటిస్తున్న నాగిన్ 3 సీరియల్ పై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అనిత 2013 లో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా నటిగా రాణిస్తోంది. తాజాగా అనిత తల్లి కాబోతోందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనిపై అనిత స్పందిస్తూ.. తన భర్త, తాను పిల్లలు పొందే విషయంలో పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నట్లు తేల్చింది.

బెస్ట్ ఫ్రెండ్ ఏక్తా కపూర్‌లాగే
ఇటీవల బుల్లి తెర స్టార్ గా వెలుగొందుతున్న ఏక్తాకపూర్ పెళ్లి కాకుండానే తల్లి అయిపోయింది. ఏక్తా కపూర్ సరోగసి విధానం ద్వారా తల్లి అయిన సంగతి తెలిసిందే. ఏక్తా కపూర్ వయసు 43 ఏళ్ళు. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కాకుండానే తల్లి అయ్యిందేంటి అంటూ ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఏక్తా కపూర్, అనిత ఇద్దరూ మంచి స్నేహితులు. తల్లి అయ్యే విషయంలో అనిత తన స్నేహితురాలిని ఫాలో అవుతోందంటూ రూమర్స్ మొదలయ్యాయి.

సహజంగానే
అనిత సరోగసి విధానం ద్వారా తల్లి కాబోతోందంటూ ప్రచారం మొదలైంది. దీనిపై అనిత స్పందిస్తూ తన ఫ్యామిలీ ప్లానింగ్ వివరించింది. తాను తల్లి కాబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నాకు అసలు సరోగసి విధానం ద్వారా తల్లి కావడం ఇష్టం లేదు. నేను సహజమైన పద్దతిలోనే తల్లిని అవుతా. నేను, నా భర్త పిల్లల కోసం వచ్చే ఏడాది ప్లాన్ చేసుకుంటున్నాం. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే వచ్చే ఏడాది నేను తల్లిని అవుతా అని అనిత తెలిపింది.

బిజీగా ఉన్నా
ప్రస్తుతం తాను నటిగా చాలా బిజీగా ఉన్నా. నేను తల్లి అయితే పూర్తి సమయం నా బిడ్డకే కేటాయించాలి. అందుకే వచ్చే ఏడాది ప్లాన్ చేసుకుంటున్నట్లు అనిత తెలిపింది. తల్లి కావడం చాలా గొప్ప అనుభూతి అని, ఆ సమయంలో కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అనిత తెలిపింది. అందరి లాగే తల్లి అయ్యాకా నా ప్రపంచం కూడా మారిపోతుందని అనిత తెలిపింది.

ప్రేమ వివాహం
అనిత, రోహిత్ రెడ్డి ఇద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ సినిమాటిక్ గా జరిగింది. అనితని రోహిత్ జిమ్ లో చూసి ప్రేమించాడు. ఆ తర్వాత పబ్ బయట అనిత తన కారు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమెతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అలా వారిప్రేమ కథ మొదలై వివాహ బంధంతో సుఖాంతం అయింది.


Click it and Unblock the Notifications











