twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 నాగార్జున అక్కినేనికి భారీ రెమ్యునరేషన్.. సౌత్‌లో మన్మథుడే టాప్!

    |

    తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రేక్షకదారణ సొంతం చేసుకొన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభానికి సిద్దమవుతున్నది. 2017లో ప్రారంభమైన తొలి సీజన్‌కు భారీ రేటింగ్ రావడంతోపాటు తదుపరి సీజన్లకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఐదో సీజన్ డిసెంబర్ 2021లో ముగిసిన తర్వాత..మళ్లీ బిగ్‌బాస్ తెలుగు 6 ప్రారంభం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ మీడియా వర్గాల హాట్ టాపిక్‌గా మారింది. తాజా సీజన్‌కు టాలీవుడ్ మన్మథుడు ఏ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకొంటున్నారంటే?

    జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా

    జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్‌గా ముంబైకి సమీపంలోని లోనావాలాలో వేసిన సెట్‌లో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో 71 ఎపిసోడ్స్ జరిగాయి. 2017 జూలై 16వ తేదీన ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సెప్టెంబర్ 24 వరకు కొనసాగింది. దాదాపు 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. విజేతగా శివ బాలాజీ, రన్నరప్‌గా ఆదర్శ్ బాలకృష్ణ నిలిచారు.

    నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా

    నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా

    ఇక బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌ సమయంలో రెమ్యునరేషన్, ఇతర అంశాల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ తప్పకోవడంతో ఆ అవకాశం నానికి దక్కింది. నాని హోస్ట్‌గా బిగ్‌ బాస్ తెలుగు 2 సీజన్ 2018 జూన్ 10న ప్రారంభమై.. 2018 సెప్టెంబర్ 30వ వరకు కొనసాగింది. దాదాపు 18 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉత్కంఠగా, వివాదాల మధ్య జరిగిన ఈ సీజన్‌లో కౌశల్ మండా విజేతగా, గీతా మాధురి రన్నరప్‌గా నిలిచారు.

    బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా

    బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాని తప్పుకోవడంతో హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చారు. అప్పటికే స్టార్ మా టెలివిజన్‌లో మీలో ఎవరు కోటీశ్వరుడుతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న నాగార్జున తనదైన శైలిలో దూసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే బిగ్ బాస్ తెలుగు 3, బిగ్ బాస్ తెలుగు 4, బిగ్ బాస్ తెలుగు 5 సీజన్లకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించారు.

    బిగ్ బాస్ 3 సీజన్ల విజేతలు వీరే..

    బిగ్ బాస్ 3 సీజన్ల విజేతలు వీరే..

    బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ 17 మంది కంటెస్టెంట్లతో 2019 జూలై 21 ప్రారంభమై.. 2019 నవంబర్ 3వ తేదీన ముగిసింది. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. శ్రీముఖిని విజేత కాకుండా కొందరు అడ్డుకొన్నారనే ప్రచారం ఆ సమయంలో జరిగింది. అయితే ఈ రెండు సీజన్లను నాగార్జున సమర్ధవంతంగా ముగించారనే ప్రశంసలు మీడియాలో కనిపించాయి.

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4, 5 గురించి

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4, 5 గురించి

    ఇక బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ 19 మంది కంటెస్టెంట్లతో 2020 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు కొనసాగింది. విజేతగా అభిజిత్, రన్నరప్‌గా అఖిల్ సార్థక్ గెలిచారు. ఇక ఐదో సీజన్‌లో 2021 సెప్టెంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు జరిగింది. వీజే సన్ని విజేతగా, షణ్ముఖ్ జస్వంత రన్నరప్‌గా నిలిచారు.

     నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే?

    నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే?

    గత ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న తర్వాత ఆరో సీజన్ కోసం నాగార్జున హోస్ట్‌గా సిద్దమవుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ కోసం ప్రతీ ఎపిసోడ్‌కు నాగార్జున 12 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకొంటున్నట్టు సమాచారం. బిగ్‌బాస్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు గాను.. నాగార్జునకు మొత్తంగా 12 కోట్ల రూపాయాలను ఎండెమాల్ షైన్ ఇండియా ముట్టజెపుతుందనేది తాజా సమాచారం.

    English summary
    Actor Nagarjuna Akkineni whopping huge remuneration for Bigg Boss Telugu 6 as host. Reports suggest that, He is charging 12 lakhs per episode for Bigg Boss Telugu 6.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X