Bigg Boss Telugu 8 Week 5th Elimination: మరో లేడీ కంటెస్టెంట్ అవుట్.. బిగ్‌బాస్ ఒక దెబ్బకు .. రెండు పిట్టలు!
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఐదోవారం ఇంటిలో సంచలనాలు కనిపించాయి. ఈ రియాలిటీ షో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మిడ్ వీక్ ఎలిమినేషన్, మరో వీకెండ్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ వారం ఇంటిలోకి మరో 8 మంది వైల్డ్ కార్డుల ద్వారా ఇంటిలోకి వస్తున్నారనే విషయం కూడా ప్రేక్షకులకు మరో షాకింగ్ న్యూస్ అయింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ఐదో వారాన్ని ముగించుకొని 6వ వారంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నది. ఈ షోలో ఇప్పటి వరకు 5 వారాల్లో 6 గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. గత నాలుగు వారాల్లో బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు.

ఇక నాలుగో వారం ముగింపులో హోస్ట్ నాగార్జున మరో ఝలక్ ఇచ్చారు. ఈ వారం ఇంటిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పినట్టే యాక్టర్ ఆదిత్య ఓం ను షోలో పోలైన అతి తక్కువ ఓట్ల ఆధారంగా, అలాగే ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేశారు.
ఇక తాజా వార్తల ప్రకారం.. వీకెండ్ ఎలిమినేషన్‌లో మరో లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసినట్టు తెలిసింది. ఈ వారం ఇంటి నుంచి నైనిక ఎలిమినేట్ చేసినట్టు ప్రకటించారు. ఆమెను వేదికపైకి తీసుకొచ్చి టీమ్‌తో మాట్లాడించారు. ఆమె జర్నీ వీడియోను చూసి అధికారికంగా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్ టీమ్ ఆధీనంలో ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత బయటకు పంపిస్తారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిన ఆదిత్య ఓం కూడా బిగ్‌బాస్ టీమ్‌తోనే ఉన్నారు. ఆయన జర్నీని, ఇంటి సభ్యులతో మాటామంతి పూర్తయాయి. నాగార్జున హోస్ట్‌గా తన ఫార్మాలిటీస్ పూర్తీ చేశారు. ఇద్దరు కూడా ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయటకు వస్తారు అని తెలిసింది. దాంతో 5 వారాల్లో 6 గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారనే విషయం స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











