twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్‌తో పెట్టుకొంటే.. ఖేల్ ఖతం.. తనీష్‌తో మిడ్‌నైట్ మసాలా.. అదే నందిని కొంప ముంచిదా !

    By Rajababu
    |

    బిగ్‌బాస్ ఊహించని సంఘటనలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. గతవారం ఎలిమినేషన్‌లో భాగంగా నందినిరాయ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లిన వారు ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. కానీ నందిని ఎలిమినేషన్ మరోసారి చర్చకు దారి తీసింది. ప్రేక్షకుల్లో నందిని స్వయంగా చేసిన తప్పులే ఆమె షో నుంచి బయటకు రావడానికి కారణమైందనే వాదన వినిపిస్తున్నది.

    కౌశల్‌కు ఫ్రెండ్‌గా నందిని

    కౌశల్‌కు ఫ్రెండ్‌గా నందిని

    బిగ్‌బాస్ ఇంట్లోకి ఓ వారం తర్వాత నందిని ప్రవేశించింది. అప్పటికే ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి కౌశల్ . తొలినాళ్లలో ఫ్రెండ్ షిప్ అంటూ ఆయనకు దగ్గరైంది. ఇంట్లో పరిస్థితి అర్థం కావడం లేదు. సలహాలు, సూచనలు ఇవ్వు అని కౌశల్‌ను అడిగింది. దాంతో నందినికి తగిన సలహాలు ఇచ్చి గైడ్ చేశారు.

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Episode 57 Highlights
    కౌశల్‌పై కామెంట్లతో

    కౌశల్‌పై కామెంట్లతో

    బిగ్‌బాస్ హౌస్‌లో మిగితా సభ్యులతో చనువు పెరుగుతున్న కొద్ది... కౌశల్‌కు దూరం కావడం మొదలుపెట్టింది. కౌశల్ ఏదైనా చెబితే దానికి కౌంటర్ ఇవ్వడం చేస్తు వచ్చింది. అలాగే మిగితా ఇంటి సభ్యుల ముందు కౌశల్‌పై కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. దాంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దారుణంగా మాట్లాడుతూ నోరు జారింది.

    కౌశల్‌ను పట్టించుకోకుండా దూరంగా

    కౌశల్‌ను పట్టించుకోకుండా దూరంగా

    బిగ్‌బాస్ విధించే టాస్కుల్లో కూడా కౌశల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం చేసింది. కౌశల్, భానుశ్రీ, తేజస్వినికి మధ్య వివాదంలో కూడా అతడినే తప్పు పట్టినట్టు చూసింది. గీతామాధురి ముందుకొచ్చి కౌశల్‌కు సపోర్ట్‌గా నిలిచింది. అయితే ఆ వ్యవహారంలో నందిని తేడాగా వ్యవహరించడం కౌశల్‌కు సహజంగానే మండింది.

    ఫ్రెండ్స్‌గా ఉందామని కౌశల్..

    ఫ్రెండ్స్‌గా ఉందామని కౌశల్..

    నందినితో ఫ్రెండ్‌షిప్‌ను పునరుద్దించుకొనేందుకు కౌశల్ చాలాసార్లు ప్రయత్నించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే విషయాలు పక్కన పెడితే ముందు నుంచి మనం ఫ్రెండ్స్.. మనం ఫ్రెండ్స్‌గానే ఉండాలి అని నచ్చ చెప్పారు. ఆ సమయంలో సరేనని తలూపినప్పటికీ మళ్లీ కౌశల్‌పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది.

    నందినిని తప్పించిన కౌశల్

    నందినిని తప్పించిన కౌశల్

    మూడు వారాల క్రితం ఎలిమినేషన్‌ ప్రక్రియలో శ్యామల, నందిని ఉండగా.. తన ఫ్రెండ్ అనే ఒక్క కారణంగా.. ఓ అవకాశం ఇస్తే మళ్లీ సరిదిద్దుకొంటుందనే కారణంతో కౌశల్ ఆమెను తనకున్న పవర్‌ను ఉపయోగించి ఎలిమినేషన్‌ నుంచి తప్పించారు. కానీ కౌశల్ చేసిన సహాయాన్ని లైట్ తీసుకున్నది.

     తనీష్‌తో నందిని రొమాన్స్‌

    తనీష్‌తో నందిని రొమాన్స్‌

    గత కొద్దివారాలుగా తనీష్‌తో రొమాన్స్ చేయడానికి నందిని తెగ ప్రయత్నించింది. పలుమార్లు నీవంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ కెమెరాకు దొరికిపోయారు. ఇంట్లో కౌగిలింతలో తనీష్, నందిని హోరెత్తించారు. పలుమార్లు వీకెండ్‌లో కౌగిలింతలు అందరికీ సమానంగా ఇవ్వాలని తనీష్‌కు నాని చురకలు అంటించారు.

    తనీష్‌తో గాఢమైన కౌగిలిలో

    తనీష్‌తో గాఢమైన కౌగిలిలో

    తనీష్, నందిని చేసిన ఓ వ్యవహారం గతవారం వివాదంగా మారింది. దీప్తి సునైనా పడుకొన్నదని నిర్ధారించుకొన్న తర్వాత అర్ధరాత్రి లేచి తనీష్ బెడ్‌పైకి వెళ్లి గాఢంగా కౌగిలించుకోవడం ప్రేక్షకులకు మంట పెట్టినట్టయింది. దాంతో నందని వ్యవహారం మిస్టరీగా మారింది.

    నందిని చీట్ చేసింది..

    నందిని చీట్ చేసింది..

    రెండు వారాల క్రితం నామినేషన్ ప్రక్రియలో భాగంగా నందినిని కౌశల్ నామినేట్ చేశాడు. నేను ఏదైనా సహిస్తాను కానీ.. ఫ్రెండ్ షిప్‌ను అడ్డం పెట్టుకొని మోసం చేస్తే నేను సహించలేను. నందిని చేసే పనులు నాకు కోపం తెప్పించాయి. నందినికి బదులు శ్యామలను ఎలిమినేట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుందని కౌశల్ కామెంట్ చేయడంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి అందుకొన్నాయి.

    English summary
    Bigg Boss 2 Telugu 56 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. 56th day highlights are Nandini eliminated from house. she threw a bigg bomb on Roll Rida.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X