Bigg Boss Elimination: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ అవుట్.. 9వ వారంలో టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేషన్!

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో ఎలిమినేషన్ ప్రక్రియకు సిద్దమైంది. ఈ వారం నామినేషన్‌లో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే చివరకు వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఎవరు ఎలిమినేట్ అయ్యారనే వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఎలిమినేట్ అయిన వారిలో బేబక్క, శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత, మణికంఠ, మహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్‌లో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే. 5వ వారంలో డబుల్ ఎలిమినేషన్‌ జరిగింది.

Is Nayani Pavani eliminated in 9th Week from Bigg Boss Telugu 8

బిగ్‌బాస్ తెలుగు 8 తొమ్మిది వారంలో హోరాహోరీగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఐదుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్‌కు అవకాశం ఉన్న కంటెస్టెంట్లలో గౌతమ్, యష్వీ, నయనీ పావని, టేస్టీ తేజ, హరితేజ నామినేట్ అయ్యారు. అయితే వారిలో చివరి వరకు హరితేజ, నయని పావని డేంజర్ జోన్‌లోకి వెళ్లారు.

అయితే ఈ వారం భారీగానే ఓటింగ్ జరిగింది. ఈ వారం అత్యధికంగా యష్వీకి టాప్ ఓటింగ్ జరిగింది. ఆమె అత్యధికంగా 45 శాతం ఓటింగ్ తెచ్చుకొన్నది. ఆ తర్వాత గౌతమ్ 25 శాతం, టేస్టీ తేజ 16 శాతం, హరి తేజ 11 శాతం, నయనీ పావని 10 శాతం ఓట్లను తెచ్చుకొన్నది. అయితే ఇద్దరి మధ్య స్వల్ప తేడాతో ఉన్నప్పటికీ.. మిస్డ్ కాల్ డేటాలో హరితేజ భారీగా ఓట్లు తెచ్చుకోవడంతో సేఫ్ అయింది.

Is Nayani Pavani eliminated in 9th Week from Bigg Boss Telugu 8

దాంతో 9వ వారంలో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ నుంచి నయనీ పావని ఎలిమినేట్ అయ్యారు. గత సీజన్‌లోనే వెంటనే ఎలిమినేట్ అయిన ఈ అందాల భామ.. వైల్డ్ కార్డుతో రెండోసారి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఎక్కువ రోజులు ఇంటిలో ఉండలేకపోయింది. తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో 10వ వారం కీలకంగా మారనున్నది. ఇంటిలో దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో నామినేషన్స్ ప్రక్రియ కూడా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఇంటిలో ఉండేందుకు కంటెస్టెంట్లు తమ తమ వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్ ట్విస్టు ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X