ఇంటి నుంచి నోయల్ సీన్ అవుట్!.., షాకిచ్చిన బిగ్‌బాస్.. రూమర్లకు నాగార్జున చెక్

బిగ్‌బాస్ తెలుగు షో హోస్ట్‌కు సంబంధించిన ఊహాగానాల మధ్య నాగార్జున అక్కినేని వేదికపైన దర్శనమివ్వడంతో ప్రేక్షకులు, కంటెస్టెంట్లు సంతోషంలో మునిగిపోయారు. మీకు దూరంగా ఉండలేక మళ్లీ హోస్ట్‌గా వచ్చేశాను అంటే నాగార్జున చెప్పడం గమనార్హం. వేదికపైకి వచ్చిన నాగ్ ఇంటి సభ్యుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి చక్కటి వ్యూహాన్ని అనుసరించాడు. 54వ రోజు ఇంటిలో జరిగిన విషయాలను చూపిస్తూ..

ఇంటిలో వంటలపోటీలు

ఇంటిలో వంటలపోటీలు


ఇంటి సభ్యులకు వంటల పోటిని బిగ్‌బాస్ నిర్వహించాడు. అమ్మాయిలను ఒక టీమ్‌గా, అబ్బాయిలను ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు. మెహబూబ్, అభిజిత్‌ను సంచాలకులుగా వ్యవహరించాలని కోరాడు. మహిళల బృదం పలు వంటలు చేసి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అలాగే పురుషుల టీమ్ కూడా పసందైన వంటకాలు చేశారు. చివరకు పురుషుల టీమ్‌ను సంచాలకులు విజేతలుగా ప్రకటించారు.

ఇంటి సభ్యులకు నాగార్జున గిఫ్టులు

ఇంటి సభ్యులకు నాగార్జున గిఫ్టులు

ఆ తర్వాత వేదిక నుంచి నాగార్జున ఇంటి సభ్యులతో ముచ్చటించారు. కుల మనాలి విశేషాలు చెప్పారు. కులు మనాలిలో లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఉంది. షాప్స్ అన్ని మూసివేశారు. చివరకు ఒక షాప్‌ను తెరిపించి కొన్ని గిఫ్టులు తెచ్చాను అని నాగ్ చెప్పగానే ఇంటి సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. కొన్ని శాలువాలు, బట్టలు తీసుకొని వచ్చాడు. వాటిని ఇంటి సభ్యులు అల్లరి చేస్తూ తమకు నచ్చిన వాటిని తీసుకొని ఎంజాయ్ చేశారు.

ఇంటి సభ్యులకు వీడియోలు చూపించి

ఇంటి సభ్యులకు వీడియోలు చూపించి


ఇక ఇంటిలోని సభ్యుల మధ్య విభేదాలను నాగార్జున పరిష్కరించేందుకు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో అఖిల్, సోహైల్ మధ్య విభేదాలకు కారణాలు చూపిస్తూ.. ఓ వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోలో తమ మధ్య చిచ్చు విషయాన్ని గ్రహించి తమలోని విభేదాలను పరిష్కరించుకొని కలిసి పోయారు. అలాగే మోనాల్‌కు కూడా కొన్ని విషయాలను వీడియోను ప్రదర్శించి చూపించారు. అలా ఇంటి సభ్యుల మధ్య విభేదాలు పరిష్కరించేందుకు చేయడంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు.

బిగ్‌బాస్ విలన్ ఎవరంటే..

బిగ్‌బాస్ విలన్ ఎవరంటే..


ఇక వారాంతపు ఎపిసోడ్‌లో బిగ్ బాస్ జర్నిలో విలన్ ఎవరు? అంటూ ఇంటి సభ్యులను అడిగారు. దాంతో తమకు విలన్‌గా వ్యవహరించే వారి గురించి అందరూ చెప్పారు. వారు ఎందుకు తమకు విలన్‌గా మారారనే విషయాన్ని తమకు ఎదురైన అనుభావాలను ఆధారంగా నాగార్జునకు చెప్పారు. అలా ఇంటి సభ్యులు విలన్ ఎపిసోడ్‌ను ముగించారు.

అఖిల్ సార్థక్ సేఫ్..

అఖిల్ సార్థక్ సేఫ్..


ఇలా ఫన్ గేమ్స్ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఒక బొమ్మను తీసుకొచ్చి నామినేట్ అయిన వారి చేతిలో పెట్టారు. పాప బొమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎవరి చేతిలో ఉండగా నవ్వుతే వారు సేఫ్ అవుతారు అని నాగ్ చెప్పారు. అలా నామినేట్ అయిన మోనాల్, అఖిల్, సోహైల్, లాస్య, అమ్మా రాజశేఖర్, మెహబూబ్ పాపను ఏడుపు మాన్పించేందుకు ప్రయత్నించారు. అలా అఖిల్ చేతిలోకి రాగానే పాప ఏడుపు మానేసి నవ్వడంతో ఆయన సేఫ్ అయ్యారు.

ఇంటి నుంచి నోయల్ సీన్ బయటకు

ఇంటి నుంచి నోయల్ సీన్ బయటకు

ఇదిలా ఉండగా, ఇంటి సభ్యులకు నాగార్జున మరో షాక్ ఇచ్చారు. అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన నోయల్ సీన్ మళ్లీ ఇంటిలోకి ప్రవేశించారు. నాగార్జునతో కలిసి వేదికపై నుంచి మాట్లాడాడు. ఇంటి సభ్యులతో మాట్లాడుతూ షాకిచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. అయితే నోయల్ అనారోగ్యంతో ఇంటి బయటకు వెళ్లడం ఇంటి సభ్యులను గందరగోళానికి గురిచేసింది.

నోయల్ సీన్‌కు వీడ్కోలు చెప్పిన నాగార్జున

నోయల్ సీన్‌కు వీడ్కోలు చెప్పిన నాగార్జున


నోయల్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి రావడంతో నాగార్జున బాధపడ్డారు. కీళ్ల నొప్పుల వల్ల ఇంటిలో ఉండే లేకపోవడంతో నోయల్ సీన్‌కు వీడ్కోలు పలికారు. నోయల్ సీన్‌కు లైఫ్ జర్నీని చూపించాడు. అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడించారు. నోయల్ చెప్పిన విషయాలతో ఏకిభవించని అవినాష్ గట్టిగా అరిచాడు. అలా నోయల్ సీన్ జర్ని అలా బిగ్‌బాస్‌లో ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X