Bigg Boss Telugu 5 Winner పవన్ కల్యాణ్ అభిమానియేనా? టాప్ కంటెస్టెంట్‌కు అండగా మెగా ఫ్యాన్స్ ట్రెండింగ్
అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ రియాలిటి షో విజయవంతంగా చివరి అంకానికి చేరుకొన్నది. కొద్ది రోజుల్లో విజేత ఎవరో తెలిసిపోనున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత ఎవరు అవుతారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోను, అభిమానుల్లోను చర్చనీయాంశమైంది. అయితే ఎప్పటి మాదిరిగానే విజేతను నిర్ణయించేది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్సే అనే వాదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా పవన్ స్టార్ అభిమానులు అండగా నిలిచిన కంటెస్టెంట్ విజేతగా నిలుస్తారా అనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం..
Recommended Video

బిగ్‌బాస్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ హవా
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో మొదటి నుంచి 5వ సీజన్ వరకు కంటెస్టెంట్లకు ఓటింగ్ విషయంలో పవర్ స్టార్ అభిమానులు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను అభిమానించే సెలబ్రిటీని అక్కున చేర్చుకొని విజేతగా నిలిచారు. తమ అభిమాన గణంలో ఒక్కడైన కంటెస్టెంట్‌కు పూర్తిస్థాయిలో మద్దతిస్తూ కనిపిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ట్రెండింగ్‌లో కీలక పాత్రను పోషిస్తున్నారు.

శివ బాలాజీకి ఫుల్ సపోర్ట్‌గా
అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 విషయానికి వస్తే.. ఆ షోలో శివబాలాజీకి పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. పలు సందర్భాల్లో శివబాలాజీకి పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా పవర్ స్టార్ అభిమానులు అండగా నిలిచారు. శివబాలాజీ విజేతగా మారడంలో పవన్ కల్యాణ్ అభిమానులు కీలక పాత్ర పోషించారు. ఆయనకు భారీగా ఓట్లు వేసి తొలి సీజన్ ట్రోఫిని, 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకొనేలా చేశారు.

కౌశల్ మండాను విజేతగా నిలిపిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
ఇక రెండో సీజన్‌లో అద్భుతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్న కౌశల్ మండాకు పవన్ కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టం. పవర్ స్టార్‌కు వీరాభిమాని. తన కెరీర్‌కు అండగా నిలిచిన వారిలో పవన్ కల్యాణ్ అని బిగ్‌బాస్ షోలోను, మీడియా సమావేశాల్లోను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. బిగ్‌బాస్ సీజన్ 2 కొనసాగుతున్న రోజుల్లో సోషల్ మీడియాలో కౌశల్ మండాకు సపోర్టుగా నిలిచి ట్రెండ్ చేశారు. పవర్ స్టార్ అభిమానులు భారీగా ఓట్లు వేయడంతో కౌశల్ మండా విజేతగా నిలవడంలో వార్ వన్‌సైడ్‌గా మారిందనే విషయం తెలిసిందే.

అభిజిత్ దుడ్డాలకు పవర్ స్టార్ ఫ్యాన్స్ అండగా
ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో తనదైన శైలిలో ఆకట్టుకొన్న నటుడు అభిజిత్ దుడ్డాల కూడా పవర్ స్టార్ అభిమానియే. ఆయన పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. అభిజిత్ సీజన్ 4 విజేతగా నిలవడంలో కీలక పాత్రను పోషించిన వారిలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకరంటే ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. బిగ్‌బాస్ సీజన్ కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిజిత్‌కు పవర్ స్టార్ ఫ్యాన్స్ బహిరంగంగానే మద్దతు తెలిపారు. దాంతో ఆయన విజేతగా నిలుపడానికి ముందుండి నడిపించారు.

మెగా అభిమానిగా వీజే సన్నీ..
ఇదిలా ఉండగా, ప్రస్తుత సీజన్ బిగ్‌బాస్ తెలుగు 5లో టాప్ కంటెస్టెంట్‌గా మారిన వీజే సన్నీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ వీడియో జాకీ మెగా అభిమాని కూడా. పలు సందర్భాల్లో రాంచరణ్ అంటే ఇష్టం అంటూ షోలో కామెంట్ చేశారు. బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన రాంచరణ్ పట్ల వీజే సన్నీ తన అభిమానాన్ని చాటుకొన్నారు. టాస్కులు, ఆటపాటల సందర్భాల్లో పవన్ అంటే తనకు ఎంత ప్రేమో అనే విషయాన్ని స్పష్టం చేశారు. తన 100 రోజులకపైగా జర్నీని చూపిసుండగా.. రాంచరణ్ తన ఫోటోలో ఉన్నాడంటూ సంతోషంగా చెబుతూ కనిపించారు.

వీజే సన్నీకి పవర్ స్టార్, మెగా ఫ్యాన్స్ అండగా
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో విజేతగా నిలువడానికి బరిలో నిలిచిన వీజే సన్నీకి అండగా కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మెగా అభిమానులు కూడా సపోర్ట్‌గా నిలుస్తున్నట్టు సోషల్ మీడియాలో స్పష్టమైంది. తాము అభిమానించే నటులకు ఫ్యాన్ అయిన వీజే సన్నీకి అండగా నిలిచి.. భారీగా ఓటింగ్‌కు పాల్పడుతున్నట్టు ట్విట్టర్ ట్రెండింగ్ చూస్తే అర్ధమవుతున్నది. ఈ సారి కూడా పవర్ స్టార్ అభిమానే విజేతగా నిలుస్తాడా? లేదా వేచి చూడాల్సిందే.

బగ్‌బాస్ తెలుగు 5 విజేతకు భారీగా
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 విజేతగా నిలిచే కంటెస్టెంట్ భారీగా ప్రైజ్ మనీని, బహుమతులు గెలుచుకోబోతున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రకటించగా.. ఈ షోకు స్పాన్సర్‌గా నిలిచిన రియల్ ఎస్టేట్ కంపెనీ షాద్ నగర్‌లో ఓ వెంచర్‌లో ప్లాటును ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇంకా స్పాన్సర్లు భారీగా గిఫ్టులు అందించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











