Bigg Boss Show బిగ్‌బాస్ షోలోకి ప్రియాంక చోప్రా చెల్లెలు.. సమంత హాట్ సాంగ్‌పై ఎంట్రీ?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ హిందీ 17 సీజన్ గ్రాండ్ లాంఛ్‌కు సిద్దమైంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ షోలో ఎవరు పాల్గొంటున్నారనే విషయంపై భారీ ఊహగానాలు కొనసాగుతున్నాయి. అయితే బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు రిలీజ్ చేసిన ప్రోమోలు ఆసక్తిని రేపాయి. అయితే ఈ షోలోకి ప్రియాంక చోప్రా సోదరి అడుగుపెడుతున్నారనే వార్త అభిమానుల్లో ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రియాంక చోప్రా సోదరి నిజంగానే ఇంటిలోకి అడుగుపెడుతున్నదా? అనే వివరాల్లోకి వెళితే..
ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఇటీవల ఆమె నటించిన తిరగబడరా సామీ సినిమా మీడియాలో అత్యంత చర్చనీయాంశమైంది. మన్నారా చోప్రాను దర్శకుడు ఏఎస్ రవికుమార్ బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పద అంశంగా కనిపించింది.

తిరుగబడరా సామి సినిమా ఈవెంట్‌లో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దుపెట్టుకోవడంపై చాలా ఈజీగా తీసుకొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించిన నా సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. సినిమా చాలా చక్కగా వచ్చింది. సినిమా మంచి ఫలితాన్ని ఇస్తుందనే ఉత్సాహంలో మా యూనిట్ ఉంది. ఆ ఉత్సాహం, నేను నటించిన తీరుపై దర్శకుడు ఉత్సాహంతో చిన్న ముద్దు పెట్టుకొన్నారు. ఆ పని చేయడం వెనుక చెడు ఉద్దేశం లేదు అని మన్నారా చోప్రా చెప్పారు.

ఇలాంటి సెన్సేషనల్, కాంట్రావర్సీతో నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన మన్నారా చోప్రా మరోసారి జాతీయ మీడియాలో హైలెట్ అయ్యారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ 17 షోలోక మన్నారా చోప్రా అడుగుపెడుతున్నారు అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కూడా మన్నారా చోప్రా మాదిరిగా సెలబ్రిటీ కనిపించడంతో ఆమె అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కలర్స్ టెలివిజన్ రిలీజ్ చేసిన ప్రోమోలో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామా హిందీ వెర్షన్ పాటపై ఓ సెలబ్రిటీ స్టెప్పులేస్తూ ఘాటుగా కనిపించారు. సెలెబ్రిటీ బాడీని చూసి మన్నారా చోప్రా అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే బిగ్‌బాస్‌లో మన్నారా చోప్రా అడుగుపెడుతున్నదా? అనే విషయం కొన్ని గంటల్లోనే తేలిపోనున్నది.

ఇక బిగ్‌బాస్ హిందీ 17 షోలోకి వెళ్లే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల జాబితా విషయానికి వస్తే.. హర్షా బేనివాల్, జయ్ సోని, ఐశ్వర్య శర్మ, అంకితా లోఖండే, వికీ జైన్, ఇషా మాలవీయ, షఫాఖ్ నాజ్, మున్వర్ ఫరూఖీ, అర్మాన్ మాలిక్, పాయల్ మాలిక్, అనురాగ్ దోభల్, నీల్ భట్, కీర్తి మెహ్రా ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











