ఆ విషయంలో తొందరపడ్డానా?.. చూపులతోనే మత్తెక్కిస్తూ.. బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్
కరోనా వైరస్‌తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విరుగుడే లేని ఈ వైరస్ ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా కుదేలవుతోంది. అక్కడి ప్రజలు లక్షల్లో కరోనా బారిన పడ్డారు. వేలల్లో ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజకు శరవేగంగా విస్తరిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

21 రోజుల లాక్ డౌన్..
ఇండియాలో పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ఆదేశించింది. అయితే పరిస్థితి దిగజారిపోతుండటంలో ఈ లాక్ డౌన్‌ను ఇంకొన్ని వారాలు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఇంటి పట్టునే సెలెబ్రిటీలు..
లాక్ డౌన్‌ను అనుసరిస్తున్న సెలెబ్రిటీలు అంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, బుల్లితెర, వెండితెర అని తేడా లేకుండా ఎంతటి స్టార్ అయినా సరే గడపదాటడానికి వీల్లేదు. అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే నిత్యం షూటింగ్స్ అంటూ దేశ విదేశాలు తిరిగే స్టార్స్‌కు ఇలా ఉండటం ఎలాంటి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిగ్‌బాస్ హౌస్ మాదిరిగా..
అందరూ ఇంటికి పరిమితం కావడంతో బిగ్‌బాస్ హౌస్ మాదిరిగా ఫీల్ అవుతున్నారు. అయితే అందులో మాత్రం ఫోన్, టీవీలు వాడటం నిషేదం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అవే ఆవశ్యకం. లాక్ డౌన్‌లో ప్రతీ ఒక్కరూ టీవీతోనో, ఫోన్‌తోనో సావాసం చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ విషయం, ఇంట్లోనూ ఉంటూ బోర్ కొడుతుండటంతో బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.
Recommended Video
బోర్ కొడుతుందని చెప్పడం తొందరపాటు అవుతుందా..?
బిగ్‌బాస్ హౌస్‌లో పునర్నవి చేసిన రచ్చ, రాహుల్‌తో వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కిక్కిచ్చిన పునర్నవి తాజాగా మత్తెక్కించే పిక్స్‌ను షేర్ చేసింది. బోర్ కొడుతుందని చెప్పడం తొందరపడ్డట్టు అవుతుందా? అంటూ ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











