రాహుల్ పులిహోర సక్సెస్.. లవ్‌లో పడిపోయిన పునర్నవి.. వీళ్ల రియాక్షన్ చూస్తే తట్టుకోలేరు

Recommended Video

Rahul Sipligunj to Punarnavi - What happens if I suddenly propose you

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. మిగిలిన అన్ని హౌస్‌మేట్స్ అందరి మధ్య జరుగుతుండగా.. రొమాన్స్ మాత్రం దంపతులైన వరుణ్ సందేశ్, వితికల మధ్యనే జరిగేవి. కానీ, కొద్దిరోజులుగా ఇంట్లో మరో జంట మధ్య సరికొత్త చర్చ జరుగుతోంది. వాళ్లెవరో కాదు.. పునర్నవి - రాహుల్. వీరి మధ్య తాజాగా జరిగిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

డేటింగ్ సంభాషణతో మొదలు

డేటింగ్ సంభాషణతో మొదలు

రెండు వారాల క్రితం జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పుడు రాహుల్ నువ్వు డేట్‌లో ఉన్నావా అనగానే ఆమె అవును అని చెప్పింది. అప్పటి నుంచి వీళ్ల పులిహోర కహానీ మొదలైంది.

నాగార్జున ప్రస్తావించడంతో హైలైట్


ఓ శనివారం నాగార్జున దీనిపై మాట్లాడాడు. ఆయన చేతిలో ఉండే కోతి.. ఈ మధ్య అతడు డేటింగ్ గురించి మాట్లాడుతున్నాడు బాస్ అంటూ అనగానే అందరూ రాహుల్ వైపు చూశాడు. అప్పుడు రాహుల్ ఏదో సమాధానం చెబుతుండగా.. నాగ్ కలుగజేసుకుని నువ్వు సేఫ్ అయ్యావ్ అని చెప్పడంతో దానికి పుల్‌స్టాప్ పడిపోయింది.

నీకు ప్రపోజ్ చేయాలంటే ఎలా..?

నాలుగు రోజుల క్రితం బిగ్ బాస్ బజ్ నుంచి మరో వీడియో వచ్చింది. ఇందులో రాహుల్ - పునర్నవి మధ్య జరిగిన చర్చను చూపించారు. ‘బిగ్ బాస్‌లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత సడెన్‌గా కలిసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినంటే ఏం చేస్తావ్' అని రాహుల్ ప్రశ్నించాడు. దానికి పునర్నవి ‘ఫస్ట్ నేనేంటో తెలుసుకో' అని సమాధానం ఇచ్చింది. అప్పుడు రాహుల్ ‘నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మజాక్ ఆడుతున్నా.. సీరియస్‌గా తీసుకోకు' అన్నాడు. దీనికి పునర్నవి ‘పో.. పోయి పని చూసుకో అంటా' అంది.

గోరు ముద్దలు తినిపించిన పునర్నవి

శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో పునర్నవి - వితిక టిఫిన్ చేస్తుండగా రాహుల్ అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో పునర్నవి అతడికి గోరు ముద్దలు తినిపించింది. అబ్బా ఎంత బాగుందో అంటూ రాహుల్ మైమరిపోయి లొట్టలేసుకు తినేశాడు. ఇది చూసి వితిక ‘సిగ్గులేదురా.. ఇలా చేస్తే నీకు పిల్లని ఎవ్వరూ ఇవ్వరు' అంటూ అనడంతో రాహుల్.. పునర్నవి ప్లేట్‌లో నుంచి తీసుకుని తిన్నాడు. అప్పుడు ఇది బాగోలేదు.. పున్ను తినిపిస్తేనే బాగుంది అనడంతో అందరూ నవ్వుకున్నారు.

రాఖీ సంబరాలతో తేలిపోయింది

శుక్రవారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా పునర్నవి ‘ఈ ఇంట్లో అతడిని చూస్తే నాకు తమ్ముడు గుర్తొస్తాడు' అని చేయి చూపించింది. దీంతో రాహుల్ కంగారు పడిపోయాడు. అయితే, ఆమె చూపించింది రాహుల్ పక్కనే ఉన్న వరుణ్ సందేశ్‌ని. దీంతో అతడితో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, రాహుల్ ‘ఆమె నా వైపు చూపించింది అనుకున్నా.. అలా అయితే పారిపోయేవాడిని' అనగానే అందరూ నవ్వుకున్నారు.

హ్యాపీ రక్షాబంధన్.. రాహుల్‌కు తప్ప

హ్యాపీ రక్షాబంధన్.. రాహుల్‌కు తప్ప

ఆ తర్వాత పునర్నవి లవ్ ట్రాక్‌కు బలం చేకూర్చే విధంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప' అని అనగానే అందరూ గట్టిగా కేకలు వేశారు. దీంతో రాహుల్‌ ముఖంలో గర్వం కనిపించగా.. అందరూ నవ్వుకున్నారు. ఇప్పటికే డేటింగ్.. లవ్ సంభాషణలతో ఈ జంట చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు మాత్రం వీళ్ల గురించి బయటకు రావడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X