రాహుల్ బిగ్‌బాస్ విన్నర్.. హౌస్‌లో గందరగోళం.. డిసైడ్ చేసేది ఎవరో తెలుసా.. నాగ్ ఫైర్

శనివారం ఎపిసోడ్‌లో ఆరంభంలో ఇంటి సభ్యుల మధ్య లగ్జరీ టాస్క్, చాక్లెట్ కంపెనీ నిర్వహించిన టాస్క్‌తో సరదాగా సాగిపోయింది. బాణం ఎక్కుపెట్టి బెలూన్లను పేల్చడం, అలాగే బౌల్‌లో ప్లాస్టిక్ బాల్స్ వేయడం లాంటి గేమ్స్ ఆడించారు. ఈ గేమ్‌లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ టీమ్ విజయం సాధించింది. ఆ తర్వాత నాగ్ వేదికపై నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడటం ప్రారంభించారు. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

రాహుల్‌కు క్లాస్ పీకిన నాగ్

రాహుల్‌కు క్లాస్ పీకిన నాగ్

ఇంటి సభ్యులతో మాట్లాడటం ప్రారంభించడమే రాహుల్‌ను టార్గెట్ చేశారు. ఇంటి సభ్యులు అనని మాటలును నీవే ఊహించుకొని వారిపై ఎందుకు కామెంట్ చేస్తావు. హిమజ, వితిక విషయంలో కొన్నిసార్లు వారు చేయని, మాట్లాడని విషయాలు ప్రస్తావించి తప్పులో పడ్డావు. ఇప్పుడు శ్రీముఖిపై ఎందుకు కామెంట్ చేశావు. శ్రీముఖి చెప్పని మాటలు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది. నీకు జెంటిల్మన్ అనే ట్యాగ్ ఉంది. దానిని ఎందుకు పాడు చేసుకొంటావని హెచ్చరించాడు.

శ్రీముఖికి రాహుల్ సారీ

శ్రీముఖికి రాహుల్ సారీ

బిగ్‌బాస్‌లో వరుణ్ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నాగార్జున క్లాస్ పీకారు. శ్రీముఖిపై వరుణ్ చేసిన కంప్లయింట్‌ను ఆధారంగా చేసుకొని ఓ వీడియోను ప్రదర్శించారు. తాను బిగ్‌బాస్‌లోకి రావడానికి శ్రీముఖి రికమెండ్ చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను నాగ్ సీరియస్‌గా తీసుకొన్నారు. అయితే ఈ విషయంపై వీడియోన ప్రదర్శించడంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం కావడంతో శ్రీముఖికి రాహుల్ సారీ చెప్పారు.

బాబా భాస్కర్‌కు శ్రీముఖి

బాబా భాస్కర్‌కు శ్రీముఖి

ఇక శనివారం ఎపిసోడ్‌లో రాహుల్ విన్నర్ అనే పాయింట్ అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఫేక్ ఎలిమినేషన్ తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టిన రాహుల్‌ను ఉద్దేశించి అలీరెజా మాట్లాడుతూ .. అబ్ తూ కహా బీ నహీ జాయేగా బచ్చా (నీవు ఇక బయటకు వెళ్లువు నీవే బిగ్‌బాస్ విన్నర్) అని శివజ్యోతి చెప్పిందనే విషయం బాబా భాస్కర్‌కు చెప్పడం వీడియోలో కనిపించింది.

శివజ్యోతి చెప్పలేదని

శివజ్యోతి చెప్పలేదని

అయితే వాస్తవానికి అలీ రెజా చెప్పలేదని, తనకు హిందీ రాదు. నేను ఆ డైలాగ్స్ చెప్పలేదని శివజ్యోతి చెప్పింది. దాంతో శివజ్యోతి చెప్పని విషయాలు నీవు ఎందుకు చెప్పావని శ్రీముఖి క్లాస్ పీకారు. అయితే అర్ధరాత్రి మాట్లాడిన మాటలు సరిగా రికార్డు కాలేదనే విషయాన్ని శ్రీముఖి వెల్లడించింది.

విజేతను నిర్ణయించేది ఎవరంటే

విజేతను నిర్ణయించేది ఎవరంటే

రాహుల్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ అనేది నిర్ణయించేది ఇంటి సభ్యులు కాదు. మేము కాదు. బిగ్‌బాస్ టీమ్ కాదు. బిగ్ బాస్ విజేతను నిర్ణయించేది ప్రేక్షకులు. వాళ్లు వేసే ఓట్లను ముంబైలో థర్డ్ పార్టీ లెక్కించి వాళ్లు విజేత ఎవరన్నదీ డిసైడ్ చేస్తారు అని నాగ్ గట్టిగా మందలించారు. అనవసరంగా మీరు ఇంట్లో మాట్లాడి ఈ విషయాన్ని చులకన చేయకండి అంటూ నాగ్ పేర్కొన్నారు.

శ్రీముఖి సేఫ్

శ్రీముఖి సేఫ్


ఇక చివర్లలో నామినేషన్‌లో ఉన్న శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి నిలబెట్టి క్రాకర్స్ ఇచ్చారు. ఎవరి క్రాకర్ అయితే పేలి పూలు వెదజల్లుతుందో వారు సేఫ్ అయినట్టు భావించాలని చెప్పారు. వరుణ్, అలీ అందులో ఫెయిల్ కావడంతో వారు నామినేషన్‌లోనే ఉండిపోయారు. శివజ్యోతి, శ్రీముఖికి పోటీ పెట్టగా అందులో శ్రీముఖి సేఫ్ అయింది. దాంతో ఆమె ఆనందంలో మునిగిపోగా.. ఫైనల్ చేరిన తర్వాత గట్టిగా అరువు నాగ్ చెప్పడం శ్రీముఖి గట్టిగా కేక పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X