For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : రాహుల్ సిప్లిగంజ్‌కు పెళ్లైందా?.. సింగర్ నోయెల్ విషెస్‌ వైరల్

    |

    రాహుల్ సిప్లిగంజ్‌కు పెళ్లైందా? అది రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియకుండానా? అది సాధ్యమయ్యే పనేనా? రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అసలే రాహుల్-పునర్నవికి లింక్ పెట్టి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతోన్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కొందరు అభిమానులు కూడా అలాంటి సలహా ఇచ్చారు. అంతలా రాహుల్ పెళ్లిపై డిబేట్స్ నడుస్తూ ఉంటే చడీచప్పుడు లేకుండా రాహుల్ పెళ్లి కావడం ఏంటి? అది కూడా తనకు ఎంతో సన్నిహితుడైన సింగర్ నోయెల్ శుభాకాంక్షలు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అసలు జరిగిన సంగతేంటో ఓ సారి చూద్దాం.

    రాహుల్-పునర్నవి కెమిస్ట్రీ..

    రాహుల్-పునర్నవి కెమిస్ట్రీ..

    బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్ సందేశ్, వితికా, రాహుల్) గ్రూప్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. మధ్యలో ఎన్ని విబేధాలు వచ్చినా చివరి వరకు ఒకటిగానే కలిసి ఉన్నారు. మరీ ముఖ్యంగా పునర్నవి, రాహుల్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది.

    పెళ్లిపై లెక్కలేనన్ని వార్తలు..

    పెళ్లిపై లెక్కలేనన్ని వార్తలు..

    వీరిద్దరి పెళ్లి గురించి లెక్కలేనన్ని వార్తలు వచ్చేవి. రాహుల్‌ ఎవరిని ఇష్టపడ్డా ఆమెతోనే వివాహం జరిపిస్తామని తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన తల్లిదండ్రులు కూడా చెప్పుకొచ్చారు. అయితే రాహుల్-పునర్నవిలు కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు స్పష్టం చేశారు.

    తాజాగా అంతా ఒకేచోట...

    తాజాగా అంతా ఒకేచోట...

    తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో అంతా కలిసి సందడి చేసినట్టు కనిపిస్తోంది. సింగర్ నోయెల్, వరుణ్, వితికా, ఇంకో ఇద్దరు స్నేహితులు రాహుల్ ఇంట్లో సందడి వాతావరణాన్నితీసుకొచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోకు నోయెల్ చేసిన కామెంటే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది.

    హ్యాపీ మ్యారిడ్ లైఫ్..

    హ్యాపీ మ్యారిడ్ లైఫ్..

    అందరితో సరదాగా ఉన్న ఫోటోను షేర్ చేసిన రాహుల్.. హ్యాపీ టైమ్స్.. విత్ హ్యాపీ పీప్స్ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సింగర్ నోయెల్ స్పందిస్తూ.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్.. నీ పట్ల ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ అయింది.

    Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
    వివరాలు చెప్పండి ప్లీజ్..

    వివరాలు చెప్పండి ప్లీజ్..

    ఏంటి? ఏమంటున్నారు? రాహుల్ సిప్లిగంజ్‌కు పెళ్లైందా? అని కొందరు ఆశ్చర్యపడుతుంటే.. ఆ లక్కీ గర్ల్ ఎవరో కాస్త చెప్పండని ఇంకొంతమంది అభ్యర్థిస్తున్నారు. అయితే అదంతా ఆట పట్టించడానికి చేసి ఉంటాడని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో కాస్త క్లారిటీ రావాలంటే.. రాహుల్ స్పందించాల్సి ఉంది.

    English summary
    Is Rahul Sipligunj Got Married Singer Noel Wishes Goes Viral. He shared A Pic And Made A Comment That Happy times! With my happy peeps.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X