Don't Miss!
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రానా దగ్గుబాటికి క్రేజీ ఆఫర్.. ప్రాజెక్ట్ ఓకే అయితే ఇక ముంబైకి మకాం
వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా హడలెత్తిస్తున్న రానా దగ్గుబాటికి మరో అరుదైన అవకాశం లభించినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ టెలివిజన్ మీడియాలో మంచి ప్రజాదరణ ఉన్న రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. ఇప్పటికే తెలుగులో నంబర్‌వన్ యారీ అనే రియాలిటీ షోను అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో ఏస్ ఆఫ్ స్పేస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఎంటీవీ గేమ్ షోకు హోస్ట్‌గా
ఏస్ ఆఫ్ స్పేస్ షో ఇటీవల తన తొలి సీజన్‌ను పూర్తి చేసుకొన్నది. ఈ కార్యక్రమానికి వికాస్ గుప్తా హోస్ట్‌గా వ్యవహరించాడు. 18 మంది కంటెస్టెంట్లు 6 రూమ్‌ల కోసం ఫైట్ చేయడం ఈ గేమ్ షోలో భాగం. ఆరు గదులను సొంతం చేసుకొనే క్రమంలో ప్రేక్షకుల మదిని గెలుచుకోవడం గేమ్‌లో ప్రధాన ఆకర్షణ.
రెండో సీజన్ కోసం
తొలి సీజన్ గ్రాండ్‌గా ముగియడంతో ఎంటీవీ రెండో సీజన్‌పై దృష్టిపెట్టింది. వికాస్ గుప్తా స్థానంలో రానా దగ్గుబాటిని హోస్ట్‌గా చేయాలనే ప్రతిపాదనను నిర్వాహకులు తీసుకొచ్చినట్టు సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు.
ముంబైలో రానా దగ్గుబాటి అడ్డా
ఒకవేళ హెస్ట్‌గా అవకాశం దక్కితే ముంబైలో రానా బిజీగా మారడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హోస్ట్‌గా కన్ఫర్మ్ అయితే ఆయన ముంబైకి మకాం మార్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రానాతోపాటు కుబ్రా సేథ్, విద్యుత్ జమ్వాల్ కూడా ఈ హోస్ట్ రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఎక్కువ అవకాశాలు రానాకే ఉండొచ్చనేది తాజా సమాచారం.
భారీ ప్రాజెక్టుల్లో రానా దగ్గుబాటి
బాహుబలి తర్వాత రానా క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. హౌస్‌ఫుల్ 4, హాథీ మేరి సాథీ లాంటి పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. అలాగే హిందీ, తెలుగు భాషల్లో రూపొందే విరాటపర్వం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేణు ఊడుగుల రూపొందించే ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నది.