Bigg Boss Telugu 9 Grand Finale: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్... బిగ్‌బాస్ తెలుగు 9 చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో?
దాదాపు 105 రోజులుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న బిగ్‌బాస్ తెలుగు 9కు కొద్దిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సీజన్ విజేత ఎవరు అనేది కాసేపట్లో తేలిపోనుంది. అంతా బాగానే ఉంది కానీ విజేతకు ట్రోఫీ ఇవ్వడానికి ఎవరు రానున్నారు? అనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ నెలకొంది. తాజాగా దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్ తేజ్‌లలో ఒకరు ఖచ్చితంగా గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వారిద్దరిలో ఒకరు వస్తారని గాసిప్స్ వచ్చాయి. ఇక మధ్యలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసారి బిగ్‌బాస్ తెలుగు 9 విజేతకు ట్రోఫీ అందిస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన నటించిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషనల్స్‌లో భాగంగా ప్రభాస్ అండ్ టీమ్ హౌస్‌లో అడుగుపెడతారని వార్తలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా అది నిజమేనని నమ్మారు.

అయితే బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు ఈసారి చీఫ్ గెస్ట్ ఉండరని కొందరు చెబుతున్నారు. నాగార్జునే హోస్ట్‌గా, గెస్ట్‌గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తారని ఫిలింనగర్ టాక్. ఆయనే ఫైనల్‌లో విజేతను ప్రకటించి అవార్డ్ బహూకరిస్తారని గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు అది కూడా నిజం కాదని బిగ్‌బాస్ విన్నర్‌కు అవార్డ్ ఇవ్వడానికి మరో స్టార్ హీరో రాబోతున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ.
బిగ్‌బాస్‌కు చీఫ్ గెస్ట్‌గా రావాల్సిందిగా చిరంజీవి, రామ్ చరణ్‌లను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించింది. అయితే వారిద్దరూ షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఈసారి నాగార్జున చేతుల మీదుగానే ట్రోఫీ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. అయితే లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాస్ మహారాజా రవితేజను చీఫ్ గెస్ట్ రావాల్సిందిగా బిగ్‌బాస్ టీమ్ సంప్రదించడంతో ఆయన సానుకూలంగా స్పందించారట.
మాస్ జాతర తర్వాత రవితేజ నటిస్తోన్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీ సినిమాస్), జీ స్టూడియోస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
తన సినిమా ప్రమోషన్స్‌తో పాటు బిగ్‌బాస్ తెలుగు 9 చీఫ్ గెస్ట్‌గా రావడానికి రవితేజ అంగీకరించారని ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఫైనల్‌లో పాల్గొనేందుకు రవితేజ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రవితేజ చీఫ్ గెస్ట్‌గా వస్తారా? లేక తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమం చూసుకుని వెళ్లిపోతాడా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











