జబర్ధస్త్‌లోకి ఆయన రాకపోవడానికి రోజానే కారణమా? అంత ఇస్తామన్నా అందుకే వద్దన్నాడా?

By Manoj

తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'జబర్ధస్త్'. ఈ షో ఎంతగా సక్సెస్ అయిందో.. అంతే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. దీనిని నిషేదించాలని ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయినా సరే ఈ కామెడీ షో జబర్ధస్తుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇందులో కొన్ని లుకలుకలు బయట పడ్డాయి. ఆ సమయంలో షో మనుగడపై అనుమానాలు రేకెత్తాయి. కానీ, ఇది ఏమాత్రం రేటింగ్ తగ్గకుండా ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

దీని ద్వారా వచ్చి.. పాపులర్ అయిపోయారు

దీని ద్వారా వచ్చి.. పాపులర్ అయిపోయారు

జబర్ధస్త్ కామెడీ షో పాపులర్ అవడానికి కంటెంట్‌తో పాటు ఆర్టిస్టులు కూడా కారణమే. వాస్తవానికి ఈ షో ద్వారా ఎంతో మంది మంచి మంచి కమెడియన్లు పరిచయం అయ్యారు. వాళ్లంతా ప్రస్తుతం సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. కేవలం కమెడియన్లు మాత్రమే కాదు.. దీని వల్ల ఎంతో మంది రైటర్లు, టెక్నీషియన్లు కూడా వెలుగులోకి వచ్చారు.

నవ్వుల రాజు ఒకరు.. ఎమ్మెల్యే మరొకరు

నవ్వుల రాజు ఒకరు.. ఎమ్మెల్యే మరొకరు

జబర్ధస్త్ ప్రారంభమై దాదాపు ఏడేళ్లు కావొస్తుంది. అప్పటి నుంచి దీనికి మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో వల్ల నాగబాబు నవ్వుల బాబుగా పేరు తెచ్చుకుంటే.. రోజా ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు బహిరంగంగానే వెల్లడించిన విషయం తెలిసిందే.

సక్సెస్‌ఫుల్ షోలో లుకలుకలు

సక్సెస్‌ఫుల్ షోలో లుకలుకలు

ఏడేళ్ల పాటు విజయవంతంగా సాగుతూ వస్తున్న ‘జబర్ధస్త్'లో ఈ మధ్య లుకలుకలు బయటపడిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ షో నుంచి నాగబాబు వెళ్లిపోయారు. అంతేకాదు, ఆ తర్వాత నిర్వహకులపై ఎన్నో ఆరోపణలు సైతం చేశారు. ఇందుకోసం ఆయన కొద్ది రోజులుగా వీడియోలను విడుదల చేస్తున్నారు.

వాళ్లందరి పేర్లు తెరపైకి వచ్చాయి

వాళ్లందరి పేర్లు తెరపైకి వచ్చాయి

జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే వారు ఎవరంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. వారిలో కమెడియన్ అలీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు.

బండ్ల గణేష్ రాకపోడానికి రోజానే కారణమా?

బండ్ల గణేష్ రాకపోడానికి రోజానే కారణమా?

ఈ షోకు కొత్త జడ్జ్‌గా బండ్ల గణేష్ ఫిక్స్ అయ్యారని, ఇందుకు గానూ ఆయనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జబర్ధస్త్ నిర్వహకులు బండ్ల గణేష్‌ను సంప్రదించింది నిజమేనట. అయితే, తాను రోజాతో కలిసి పని చేయలేనని ఆయన వాళ్లకు చెప్పాడని టాక్.

 పవన్ కల్యాణ్ గురించి గొడవ

పవన్ కల్యాణ్ గురించి గొడవ

ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన డిబెట్‌లో బండ్ల గణేష్, రోజా మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ గురించి జరుగుతున్న చర్చలోనే ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇద్దరూ విచక్షణ కోల్పోయి లైవ్‌లోనే బూతులు తిట్టుకున్నారు. అప్పుడు ఇది సంచలనం అయింది. ఇప్పుడు దీనిని కారణంగా చూపి బండ్ల గణేష్ షోకు రాలేదనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X