కేసీఆర్ గడ్డ మీద నుంచి బిగ్‌బాస్‌లోకి ఇద్దరు.. ఇప్పుడు అభయ్ నవీన్.. మరొకరు ఎవరో తెలుసా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 రానే వచ్చేసింది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షో, తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో ఆదివారం (సెప్టెంబరు 1) రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ప్రముఖ సీరియల్ నటి అయిన యష్మీ గౌడ తొలుత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి.. ప్రేక్షకులనే కాదు కింగ్ నాగ్ ను కూడా అట్రాక్ట్ చేసింది. తర్వాత నటుడు, దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ కంభం, లాహిరి లాహిరి లాహిరి హీరో ఆదిత్య ఓం, దిశ చిత్రంతో గుర్తింపు పొందిన సోనియా, సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్, యాక్టర్,
బెజవాడ బేబక్క, రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ బాష, బేబీ మూవీతో నటించిన కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదికూడా జంటగా భయ్యా..
ఈ సారి సీజన్ ప్రారంభం నుంచే దిమ్మ తిరిగే ట్విస్టులు ఇస్తూ.. ప్రేక్షకులకు అల్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు బిగ్ బాస్. ఈ సారి లాంచ్ ఈవింట్ లోనే కంటెస్టెంట్స్ దిమ్మతిరిగిపోయేలా షాకులు ఇచ్చారు. అలాగే.. ట్విస్టుల మీద ట్వీస్టులు లిస్తూ... బిగ్‌బాస్ మీద భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, వీడియో షోపై మరింత క్యూరియసిటీని పెంచుతున్నాయి. తాజాగా ఓ వార్త తెగ వైరలవుతుంది.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సంపూర్ణేష్ బాబు
ఇకపోతే ప్రతి ఏటా బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా బిగ్ బాస్ సీజన్-8 లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు నేడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ వార్త నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. ఇక హౌస్‌లో నవ్వుల జాతరే అంటూ సోషల్ మీడియా వేదికన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సిద్దిపేట నుంచి బిగ్‌బాస్‌లోకి ఇద్దరు సెలబ్రిటీలు
ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధిపేటకు చెందిన అభయ్ నవీన్ బిగ్‌హౌస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి చూపులు, గీత గోవిందం చిత్రాలతో ఫేమస్ అయ్యారు. 'బిగ్‌బాస్' అనే మంచి వేదిక దొరికిందని అభయ్ నవీన్ ఎమోషనల్ అవుతూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు అదే సిద్ధిపేట నుంచి స్టార్ హీరో సంపూర్ణేష్ బాబు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ వార్త నిజమైతే... అభయ్ ఫైర్.. సంపూ కామెడీ కలిస్తే.. షోలో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ పక్కా..


Click it and Unblock the Notifications











