Bigg Boss అతడంటే నాకు పిచ్చిగా క్రష్.. ఆయనకు భార్య లేకపోతే.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ షాకింగ్‌గా!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగుతున్న బిగ్‌బాస్ హిందీ రసవత్తరంగా కొనసాగుతున్నది. గత కొన్ని వారాలుగా ఇంటిలో ఆటను క్రేజీగా మార్చిన కంటెస్టెంట్, బాంబే హైకోర్టు అడ్వకేట్ సానా రాయిస్ ఖాన్ అనూహ్యంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సనా చేసిన సంచలన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ షో టైటిల్‌ను గెలుచుకొన్న సత్తా నాకు ఉంది. ఇంటి నుంచి బయటకు రావాల్సిన కంటెస్టెంట్‌ను కాదు. దురదృష్ట వశాత్తు నేను ఎలిమినేట్ అయ్యాను. కానీ గేమ్‌ను నేను ఆలస్యంగా అర్ధం చేసుకొన్నాను. అందుకే మూల్యం చెల్లించాను. ఇంటి నుంచి ఎలిమినేట్ కావడం నాకు ఇష్టం లేదు అని సనా రాయిస్ ఖాన్ తెలిపింది.

బిగ్‌బాస్ షోలో చాలా కన్‌ఫ్యూజన్‌తో ఉన్న వ్యక్తిని అని ముద్ర వేశారు. కానీ నా కంటే చాలా మంది కన్‌ఫ్యూజన్‌తో ఉన్నారు. ప్రతీ ఒక్కరు రకరకాల కన్‌ఫ్యూజన్‌తోనే ఆడుతున్నారు. కేవలం నన్ను మాత్రమే కన్‌ఫ్యూజన్ అంటే ఒప్పుకోను అని సనా రాయిస్ ఖాన్ చెప్పింది.
బిగ్‌బాస్ ఇంటిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే భర్త వీకి జైన్‌తో నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఆయనతో నేను చాలా సన్నిహితంగా మెదిలాను. అయితే వికీతో నేను సన్నిహితంగా ఉన్న వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేశారు. పెళ్లైనా వ్యక్తితో బిగ్‌బాబస్‌లో రొమాన్స్ చేస్తున్నది అని కామెంట్ చేయడాన్ని తేలికగా తీసుకొన్నారు.

నీవు ఎవరికి సన్నిహితంగా ఉంటావో వారితో బాగా ఉండు. అప్పుడే నీవు హ్యాపీగా ఉంటావు అని చెప్పాడు. అయితే నేను కనెక్ట్ అయిన వ్యక్తి మరోకరితో కనెక్ట్ అయి ఉన్నాడని అతడితోనే నేను చెప్పాను. బిగ్‌బాస్‌లో అంకిత లోఖండే రాకపోతే పరిస్థితి మరోలా ఉండేది అని సనా రాయిస్ ఖాన్ చెప్పింది.
అంకిత, వికీ జైన్ దంపతులుగా ఇంటిలోకి రాకపోయి ఉంటే ఆయనతో నా కెమిస్ట్రీ వేరే విధంగా ఉండేది. అతడంటే నాకు చాలా క్రష్. అతను ఒంటరిగా వచ్చి ఉంటే.. అతడితో రొమాంటిక్ మూమెంట్స్ రెచ్చిపోయి చేసేదానిని. కెమెరాలు, కంటెంట్ కోసం అతడితో సన్నిహితంగా ఉండలేదు. బిగ్‌బాస్ 17 విన్నర్ అంకితా అవుతుందని జోస్యం చెప్పింది అని సనా రాయిస్ ఖాన్ తన మనసులోని మాట చెప్పింది.


Click it and Unblock the Notifications











