65 కోట్ల రెమ్యురేషన్.. బిగ్‌బాస్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!
దేశవ్యాప్తంగా బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో హవా కొనసాగుతున్నది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీలో ఈ షోలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలోనే కాకుండా ఇతర మీడియాల్లో కూడా మంచి ఆదరణ దక్కుతున్నది. తెలుగులో ఇప్పటికే ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. కన్నడలో గతవారమే ఈ షో స్టార్ట్ అయింది. ఇక తమిళం, హిందీలో షో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బిగ్‌బాస్ షో కోసం ఓ టెలివిజన్ స్టార్‌కు భారీ ఆఫర్ ఇస్తే.. ఆమె రిజెక్ట్ చేసిందనే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
హిందీ టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న సీరియల్ తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా. ఈ సిరియల్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ ఉంది. ఈ సీరియల్‌లో నటించిన దిషా వకానీకి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు హిందీ ఆడియెన్స్ పడి చచ్చిపోతారు. అలాంటి టీవీ నటికి భారీ ఆఫర్ వచ్చిందట.

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభం కాబోయే హిందీ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాలని ఎండెమాల్ షైన్ ఆఫర్ ఇచ్చారు. కానీ దిషా వకానీ ఆ ఆఫర్‌ను అంగీకరించలేదు. అందుకు ఆమె తన వ్యక్తిగత కారణాలను చూపించింది. ఆమె ఈ షోలోకి రావడానికి ఒప్పుకోలేదు అని హిందీ మీడియా తన కథనంలో వెల్లడించింది.
అయితే బుల్లితెర ప్రేక్షకుల ఫాలోయింగ్ భారీగా ఉండటంతో దిశా వకానీకి రికార్డు రెమ్యురేషన్ ఆఫర్ చేశారు. సుమారుగా 65 కోట్ల రూపాయల పారితోషికంగా అందించేందుకు సిద్దమయ్యారు. అయినా కానీ ఆమె బిగ్‌బాస్ సీజన్ 18 షోలోకి రావడానికి ఇష్టపడలేదు అనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను ఆమె పీఆర్ టీమ్ కూడా ఖండించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

బిగ్‌బాస్ హిందీ 18 షోలోకి వచ్చే కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే దిషా వకానీకి ఇవ్వడానికి మొగ్గు చూపిన మొత్తం ఊహకు అందనిది. ఆమెకు అంత ఇవ్వడానికి నిర్వాహకులు సిద్దపడారనే విషయం నమ్మే విధంగా లేదు. ఈ పారితోషికం విషయం ఊహకు అందనిది విధంగా, నమ్మశక్యంగా లేదు అని పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.
దిశా వకానీ కెరీర్ విషయానికి వస్తే.. 1997 సంవత్సరంలో కామ్సిన్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత దేవదాస్, మంగళ్ పాండే, లవ్ స్టోరి 2050 సినిమాల్లో నటించింది. సినిమా పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో టెలివిజన్ సీరియల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. శుభ్ మంగళ్ సావధాన్ ఎంట్రీ ఇచ్చి కిచిడి, ఇన్స్టాంట్ కిచిడి, హీరో, ఆహత్ సీరియల్స్‌లో నటించింది. 2008 నుంచి తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్‌లో దయా జీతా లాల్ గడా అనే పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











