Bigg Boss: నా వల్ల కావడం లేదు..ఎలిమినేట్ చేసేయండి, చేతులెత్తి మొక్కిన స్టార్ కంటెస్టెంట్
ఇండియాలో మోస్ట్ పాపులర్ మెగా రియాలిటీ షో బిగ్‌బాస్. హాలీవుడ్‌లోని బిగ్ బ్రదర్ ఆధారంగా మనదేశంలో దిగిన ఈ కార్యక్రమం అదిరిపోయే టీఆర్పీలతో దూసుకెళ్తోంది. తొలుత హిందీలో ప్రసారమైన ఈ రియాలిటీ షో.. తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ టెలికాస్ట్ అయ్యింది. ఒక్కో చోట ఒక్కో సూపర్‌స్టార్ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అదనపు హంగులు అద్దుతున్నారు.
తెలుగు విషయానికి వస్తే ప్రస్తుతం 8వ సీజన్ నడుస్తోంది. 13 వారాలు పూర్తి చేసుకుని కొద్దిగంటల్లో 14వ వారంలోకి అడుగుపెట్టనుంది. మరో రెండు మూడు వారాల్లో బిగ్‌బాస్ 8వ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. కన్నడంలో ప్రస్తుతం 11వ సీజన్ నడుస్తుండగా.. కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు మాదిరిగానే అక్కడా వైల్డ్ కార్డ్ ద్వారా కొందరు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి కూడా ఉన్నారు.

బుల్లితెర ద్వారా ఫేమ్ అయిన శోభా శెట్టి.. బిగ్‌బాస్ తెలుగు 7లోనూ కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేశారు. ఆ సీజన్ విజయవంతం కావడానికి శోభ కూడా ఒక కారణం. చీటికి మాటికి తగాదాలు, అరుపులు, కేకలు చూసి ఆడియన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆమె నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడల్లా ఎలిమినేట్ చేసేయండి మాస్టారు అంటూ కామెంట్స్ పెట్టారంటే శోభా శెట్టి సైకోయిజాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాప్ 5కి చేరకుండానే శోభా ఎలిమినేట్ అయ్యారు.
అయితే తెలుగులో బిగ్‌బాస్ విన్నర్ కావాలన్న కల నెరవేరకపోవడంతో తన మాతృభాష కన్నడంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీనిలో భాగంగానే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే రావడం రావడంతోనే భజన కార్యక్రమం మొదలుపెట్టడంతో హోస్ట్ సుదీప్ ఆమెకు షాకిచ్చారు. శోభ అడుగుపెట్టే వరకు ప్రశాంతంగా ఉన్న కన్నడ హౌస్ .. ఆమె వచ్చినప్పటి నుంచి కల్లోలం మొదలైంది. కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకోవడంతో అక్కడివాళ్లకి కూడా విసుగు పుట్టింది.
ಸೂಪರ್ ಸಂಡೇ ವಿತ್ ಬಾದ್ಷಾ ಸುದೀಪ | ಇಂದು ರಾತ್ರಿ 9 #BiggBossKannada11 #BBK11 #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa #BBKPromo pic.twitter.com/ypkz2sfD2t
— Colors Kannada (@ColorsKannada) December 1, 2024
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తాజా ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. తాను హౌస్‌లో ఉండలేకపోతున్నానని.. ఎలిమినేట్ చేసేయాలని హోస్ట్ సుదీప్‌ను కోరుతూ కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆయన మరోసారి పునరాలోచించుకోవాలని ఓ ఛాన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ శోభ తగ్గకపోవడంతో సుదీప్.. బిగ్‌బాస్‌తో చెప్పి తలుపులు తెరిపించాడు. ఇంతటితో ప్రోమో ఎండ్ కావడంతో తర్వాత ఏం జరిగింది? శోభాశెట్టి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యిందా? లేక పబ్లిసింటీ స్టంటా అంటూ ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు. శోభ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా భాష తెలియకపోయినా కన్నడ బిగ్‌బాస్ గురించి ఆరా తీస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











