Bigg Boss Telugu OTT లోకి టాప్ యాంకర్.. రియాలిటీ షోలోకి మరోసారి..
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ప్రారంభానికి సర్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ రియాలిటీ షో పూర్తి చేసుకొన్న వెంటనే నిర్వాహకులు తొలిసారి ఓటీటీ ద్వారా షోను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు, ప్రారంభం అయ్యే డేట్ గురించి రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఊహాగానాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Recommended Video

ఆశ్చర్యానికి గురైన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రారంభిస్తున్నామని చెప్పినప్పుడు నాగార్జున అక్కినేని ఆశ్చర్యపోయారట. ఇప్పుడే కదా బిగ్‌బాస్ ముగిసింది. వెంటనే ఓటీటీ ఫార్మాట్ ప్రారంభిస్తే.. ప్రేక్షకులు చూపిస్తారా? నాగ్ ప్రశ్నిస్తే.. ఓటీటీ షో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని నిర్వాహకులు చెప్పారట. నిర్వాహకులు అందించిన వివరాలతో నాగ్ సంతృప్తి చెంది హోస్ట్‌గా వ్యవహరించేందుకు వెంటనే అంగీకరించారట.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓటీటీ షో
ఇక బిగ్‌బాస్ తెలుగు 6 షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సీజన్ 6ను ప్రారంభిస్తామని, ఓటీటీకి రెగ్యులర్ షోకు ఎలాంటి లింకు ఉండదు. రెండు వేర్వేరు ఫార్మాట్స్‌తో కొనసాగుతాయి. సరికొత్తగా ఓటీటీని ఫార్మాట్ ప్రారంభిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.

తమిళంలో గ్రాండ్‌గా ఓపెన్.. మంచి రెస్పాన్స్
ఇదిలా ఉండగా, తమిళంలో బిగ్‌బాస్ ఓటీటీ ఫార్మాట్‌కు సంబంధించిన షో జనవరి 31న ప్రారంభమైనది. ఈ షోలో గత సీజన్లలో పాల్గొన్న టాప్ కంటెస్టెంట్లు ఉన్నారు. 24 గంటలపాటు ఈ షోను ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌పై ప్రదర్శిస్తున్నారు. తమిళంలో మంచి స్పందన రావడంతో తెలుగులో కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్ల పరంగా వేగంగా పెంచారు. తెలుగు ఓటీటీ ఫార్మాట్ షో ఫిబ్రవరి 26న ప్రారంభం అవుతుందని బిగ్‌బాస్ వర్గాలు స్పష్టం చేశాయి.

యాంకర్ రవి స్పందిస్తూ..
అయితే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో తాను పాల్గొంటానని వచ్చిన వార్తలపై యాంకర్ రవి స్పందించాడు. తాను ఓటీటీ ఫార్మాట్లో పాల్గొనడం లేదు. బిగ్‌బాస్ షో నాకు చాలా నేర్పింది. అయితే కొన్ని కమిట్‌మెంట్స్ కారణంగా నేను వెళ్లకపోవచ్చు. ఇంకా సమయం ఉంది కాదా.. ఏదైనా మంచి అవకాశం వస్తే.. వెళ్లడానికి ఆలోచిస్తాను అని యాంకర్ రవి చెప్పారు

బిగ్‌బాస్ ఓటీటీ షోలోకి శ్రీముఖి
ఇక బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో శ్రీముఖి, వర్షిణి సౌందర్య రాజన్, దీపిక పిల్లి లాంటి సెలబ్రిటీలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రఘు మాస్టర్, యాంకర్ స్రవంతి, నవ్య స్వామి, నవదీప్, వైష్ణవీ చైతన్య, మౌనిక రెడ్డి, యాంకర్ వర్ష్, మహబూబ్, శ్రీహాన్, మౌనికా రెడ్డి, శ్రీ విద్య, శ్వేతా నాయుడు తదితరులు ఈ షోలో పాల్గొంటారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











