శ్రీముఖి కెరీర్ స్లో.. అదే ఆమె కొంప ముంచిందా?

పటాస్ రాములమ్మ అనే పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండేవాడు కాదు. ఒకప్పటి ఒసేయ్ రాములమ్మ పాటను మళ్లీ నేటి తరానికి తనదైన స్టైల్లో పరిచయం చేసిన శ్రీముఖి.. బుల్లితెరపై ఓ వెలుగు వెలిగింది. టాప్ యాంకర్‌గా దూసుకుపోయిన శ్రీముఖి.. అదే ఫేమ్‌తో బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని కొట్టేసింది.

అందరికీ కలిసి రాని షో..

అందరికీ కలిసి రాని షో..

బిగ్‌బాస్ షో అనేది అందరికీ కలిసి రాదు. ఎవ్వరికీ తెలియని ఓ పేరును అందరి గుండెల్లోకి చొచ్చుకునేలా చేస్తుంది.. అందరికీ తెలిసిన మనిషిని ద్వేషించాలనూ చేస్తుంది. ఈ షోలో పాల్గొంటే కచ్చితంగా ఇలానే జరుగుతుంది, కెరీర్ ఇలా కొనసాగుతుంది అని లెక్కలు వేసుకుంటే కుదరదు.

విన్నర్‌గా నిలిచినా రాని అవకాశాలు..

విన్నర్‌గా నిలిచినా రాని అవకాశాలు..

గత రెండు సీజన్లలో విన్నర్‌గా నిలిచిన శివ బాలాజీ, కౌశల్‌లకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. శివ బాలాజీపై కాసింత అభిమానం పెరిగింది, అతనంటే అందరికీ ఓ గౌరవం ఏర్పడింది. ఇక కౌశల్ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచింది. అతని విషయంలో ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ ఉంది. రెండో సీజన్‌లో టైటిల్ గెలిచినా అతని స్థితిలో ఏ మార్పు రాలేదు. గెలవడం ముఖ్యం కాదు దాన్ని కాపాడుకోవడం, వాడుకోవడం కూడా తెలియాలి.

వాడుకోవడం మొదలుపెట్టిన కంటెస్టెంట్లు..

వాడుకోవడం మొదలుపెట్టిన కంటెస్టెంట్లు..

అందరి కంటే ఎక్కువగా ఈ మూడో సీజన్ కంటెస్టెంట్లు తమకు వచ్చిన ఫేమ్‌ను వాడుకుంటోన్నారు. ఈ క్రమంలో హిమజ అందరికంటే ముందుగా ఉంటుంది. ఎలిమినేట్ అయి బయటక వచ్చినప్పటి నుంచి తనకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్తోంది. ఈమెతో పాటు అషూ, శివజ్యోతిలాంటి వారు కూడా అంతో ఇంతో వెనకేసుకుంటున్నారు.

స్పీడ్ పెంచిన రాహుల్..

స్పీడ్ పెంచిన రాహుల్..

మూడో సీజన్ టైటిల్ గెలిచిన రాహుల్ కాసింత వేగాన్ని పెంచినట్టు కనిపిస్తోంది. తన ప్రొఫెషన్ అయిన సింగింగ్‌లో పలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. బయటకు వచ్చిన క్షణం నుంచే రికార్డింగ్‌లంటూ బిజీగా గడిపేస్తున్నాడు. తన సత్తా చాటేందుకు గ్రాండ్‌గా ఫ్యాన్ మీట్‌ను కూడా నిర్వహించబోతోన్నాడు.

స్లోగా సాగుతున్న కెరీర్..

స్లోగా సాగుతున్న కెరీర్..

బిగ్‌బాస్ షోకు ముందుకు క్షణం తీరిక లేకుండా షూటింగ్‌లతో బిజీగా గడిపిన శ్రీముఖికి ప్రస్తుతం పరిస్థతి తారుమారైనట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షో అయిన వెంటనే వారం రోజుల పాటు మాల్దీవులకు వెళ్లి హాయిగా గడిపి వచ్చింది. వచ్చాక తన షెడ్యూల్ గురించి, కొత్త ప్రోగ్రామ్‌ల గురించి అప్‌డేట్ చేస్తానని చెప్పుకొచ్చింది.

తేజస్వీ మాదిరిగా షో..

తేజస్వీ మాదిరిగా షో..

రెండో సీజన్‌లో బ్యాడ్ అయిన తేజస్వీ ఆ మధ్య లాఫ్టర్ కామెడీ అనే ఒక షో చేసింది. అయితే ఆమెకు వచ్చిన నెగెటివిటీతో ఆ షో దెబ్బకు తలకిందులైంది. ఆ షో వచ్చిన సంగతి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలికుండా పోయింది. తాజాగా ఇలాంటి ఓ కొత్త రకమైన షోను శ్రీముఖి చేత ప్లాన్ చేయించింది స్టార్ మా బృందం.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
కొత్త ప్రోగ్రామ్‌తో ప్రేక్షకుల ముందుకు..

కొత్త ప్రోగ్రామ్‌తో ప్రేక్షకుల ముందుకు..

ఎవరు ఔనన్నా కాదన్నా..బిగ్‌బాస్ షో వల్ల శ్రీముఖికి కాస్త నెగిటివిటీ పెరిగిన మాట వాస్తవమే. మ్యూజిక్ రీలోడెడ్ అంటూ ఓ కొత్త షో మాత్రమే చేస్తోంది శ్రీముఖి. పటాస్ షోకు కూడా గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. పటాస్‌తోనే గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి.. మళ్లీ అలాంటి షో పడుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా బిగ్‌బాస్ తరువాత శ్రీముఖి కెరీర్ నత్త నడకన సాగుతున్నట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X