Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6 లోకి వకీల్ సాబ్.. బిగ్‌బాస్‌లోకి వెళ్లే పేదల లాయర్ ఎవరంటే?
బుల్లితెరపైన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ ఎంతో మాటల్లో చెప్పలేం. ప్రతీ సీజన్ సరికొత్త రేటింగ్‌తో ముందుకెళ్తున్నది. గతేడాది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5ని పూర్తి చేసుకొన్న ఈ షో.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 సిద్దమవుతున్నది. ఇటీవల ఓటీటీ ఫార్మాట్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ తెలుగు 6వ సీజన్‌కు సంబంధించి వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల పేర్లలో ఆశ్చర్యకరమైన వ్యక్తి తెరపైకి వచ్చారు. ఆ కంటెస్టెంట్ వివరాల్లోకి వెళితే..
సీజన్ 6 కోసం భారీ ఏర్పాట్లు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కి సంబంధించిన షోకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఓటీటీ షో పూర్తి కాగానే.. సెట్‌ను పూర్తిగా మార్చేసి.. కొత్త సెట్‌ను నిర్మిస్తున్నారు. సెట్ నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగా సెట్‌ను రూపొందిస్తున్నారు.
జోరుగా కంటెస్టెంట్ల ఎంపిక
ఒకవైపు రకరకాల పనులు పూర్తి చేసుకొన్న బిగ్‌బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లలో ఇద్దరి పేర్లు, అలాగే కొందరు యువ యూ ట్యూబర్లు, ఇంకా సినీ, టెలివిజన్; సోషల్ మీడియాకు చెందిన పలువురు ఈ షోలోకి వెళ్లున్నట్టు ప్రచారం జోరుగా సాగుతున్నది. పలువురి పేర్లు తెరపైకి వచ్చి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ సారి కామన్ పీపుల్స్ నుంచి కూడా కొందరిని ఇంటిలోకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు.
బిగ్‌బాస్‌లోకి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్
అయితే బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారి ఓ యంగ్ లాయర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు సింగ్ పోగు బిగ్‌బాస్ ఇంటిలో అడుగు పెడుతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ లాయర్‌కు పేదల వకీల్ సాబ్ ని పేరు కూడా ఉంది. ఇప్పటికే చాలా పేదలకు న్యాయ సహాయం చేస్తూ వందల మంది బాధితుల కేసులను వాదించి విజయం చేకూర్చారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సుబ్బు సింగ్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధార్థ గ్రామానికి చెందిన సుబ్బు సింగ్ పోగు ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను పూర్తి చేసుకొన్నారు. సుబ్బు సింగ్‌కు నాటకరంగంలో విశేష అనుభవం ఉంది. ఇటీవల ఆయన కొన్ని చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే సుబ్బు సింగ్‌కు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం.
జూలై మూడో వారంలో ప్రారంభం
బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు ముగిసినట్టు సమాచారం. ఈ రియాలిటీ షో జూలై మూడో వారంలో గానీ.. లేదా చివరి వారంలో గానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ షోకు సంబంధించిన హోస్ట్, ప్రోమోలను విడుదల చేసి అధికారికంగా షో తేదిని ప్రకటిస్తారు.