Bigg Boss Telugu 6 Elimination ఇంటి నుంచి వంటలక్క అవుట్.. ఆ కల తీరకుండానే పింకీ బయటకు!
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో మరో ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. గతవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లను సేవ్ చేసుకొనేందుకు జరిగిన ఓటింగ్ హోరాహోరీగా జరిగింది. అయితే 6వ వారం ఇంటి నుంచి మహిళా కంటెస్టెంట్ బయటకు వెళ్లక తప్పలేదు. ఇంటిలో వంటలక్కగా పేరు ఉన్న కంటెస్టెంట్‌ను 6వ వారం షో నుంచి బయటకు పంపించారు. ఆ కంటెస్టెంట్ వివరాల్లోకి వెళితే..

6వ వారం నామినేషన్లలో
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఆరవ వారం మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో శ్రీహాన్, ఆదిరెడ్డి, మరీనా, సుదీప, శ్రీ సత్య, కీర్తి భట్, బాలదిత్య, రాజ్, గీతూ ఉన్నారు. అయితే అందరూ టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో 6వ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.

ఎవరెవరికి ఎంత ఓటింగ్ అంటే?
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో నామినేట్ అయిన వారిలో శ్రీహాన్ అత్యధికంగా 20 శాతం ఓట్లు సంపాదించుకోగా, ఆది రెడ్డి 13 శాతం, మరీనా 11 శాతం, శ్రీ సత్య, బాలాదిత్య, రాజ్, గీతూ 10 శాతం మేర ఓట్లు రాబట్టుకొన్నారు. అయితే అతి తక్కువగా సుదీప 9.5 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. దాంతో సుదీప డేంజర్ జోన్‌లోకి వెళ్లారు.

వంటలక్కగా సుదీప..
అయితే సుదీప ఇంటిలో ఎక్కువగానే హడావిడి చేసింది. కానీ వంటగదికే ఎక్కువగా పరిమితమైంది. ఇంటిలోని సభ్యులందరికీ మంచి భోజనాన్ని అందజేసి వంటలక్కగా పేరు తెచ్చుకొన్నది. అయితే టాస్కుల్లో పెద్దగా రాణించలేకపోయింది. ఇంటి సభ్యుల్లో ఒక గ్రూపుకే పరిమితం కావడం, తన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం మైనస్‌గా మారింది.

సుదీప అనే పేరు సంపాదించుకొని..
అయితే బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలోకి వచ్చే ముందు వేదికపై నాగార్జునతో తన భావాలను పంచుకొంటూ.. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకి పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అందరూ నన్ను పింకి అని పిలుస్తుంటారు. నా పేరు సుదీప అనే విషయం మరిచిపోయారు. అయితే బిగ్‌బాస్ వేదిక నుంచి నాపేరు సుదీప అనే విషయాన్ని అందరికి గుర్తు చేసి.. టైటిల్ గెలుచుకొంటాను.. సుదీపగా అందర్నీ ఆకట్టుకొంటాను అని చెప్పారు.

బిగ్‌బాస్ నుంచి సుదీప ఎలిమినేట్
అయితే బిగ్‌బాస్ తెలుగు 6 ఎలిమినేషన్‌లో తక్కువ ఓట్లు వచ్చిన సుదీపను ఎలిమినేట్ చేసినట్టు వార్తలు వెలుగు చూశాయి. శనివారం సాయంత్రం ముగిసిన ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ అనంతరం సుదీపను ఇంటి నుంచి హోటల్‌కు తరలించే ఏర్పాట్లు చేశారనేది విశ్వసనీయ సమాచారం. దీంతో ఇంటిలో 6వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసినట్టు సమాచారం.

ఆ కల తీరకుండానే..
బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్‌లో ఇంటిలో భారీ పోటీ ఇస్తుందని భావించిన సుదీప ఎలిమినేట్ అయ్యారనే విషయంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. సుదీపగా గుర్తింపు తెచ్చుకోకుండానే.. వంటలక్క పేరుతో పింకి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సుదీప అలియాస్ పింకి ఎలాంటి విషయాలు బయటపెడుతారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











