వారంతా ఒక్కటిగా.. ఆమెను దూరం పెట్టారా?.. వీడియో కాల్‌లో బిగ్‌బాస్ హౌస్‌మేట్స్

బిగ్‌బాస్ రెండో సీజన్ ఓ వింత. ఎందుకు గొడవలు మొదలు అవుతాయో? ఎవరెవరు దగ్గరువుతారో? ఏదీ చెప్పలేకపోయారు. రెండో సీజన్‌లో గొడవలు జరగని రోజంటూ లేదు. ఒక్కోసారి కౌశల్ అంతా ఒకవైపు.. మిగతా పార్టిసిపేట్స్ అంతా ఓ వైపు ఉన్నట్టు అనిపించేది. ఉండే పదహారు పదిహేడు మందిలో ఎన్నో గ్రూపులు మెయింటేన్ చేసేవారు. అయితే కౌశల్ ఒక్కడు మాత్రం ఏ గ్రూప్‌లోనూ ఉండేవాడు కాదు. ముఖ్యంగా గీతామాధురి, శ్యామల, యాంకర్ దీప్తి ఓ జట్టుగా ఉండేవారు. సామ్రాట్, తనీష్, దీప్తి, తేజస్వీని ఓ గ్రూప్‌లా ఉండేవారు. చూస్తుంటే వీరిలో చీలికలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా వీరు షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తే ఓ విషయం అర్థమవుతోంది.

గ్రూపులుగా హల్చల్..

గ్రూపులుగా హల్చల్..


రెండో సీజన్‌లో ఉన్నన్ని గ్రూపు రాజకీయాలు మరే సీజన్‌లో కనిపించలేదు. దాదాపు నాలుగు గ్రూపులుగా విడిపోయినట్టు అనిపించేది. చివరకు మాత్రం తనీష్, గీతామాధురి, సామ్రాట్ మంచి స్నేహితులుగా మారారు. మొదట్లో దూరంగా ఉండే వీరు.. టాప్ 5లోకి చేరేవరకు చేసిన ప్రయాణంలో దగ్గరయ్యారు.

బయటకు వచ్చాక కూడా..

బయటకు వచ్చాక కూడా..

హౌస్‌లో ఎలా ఉన్నా, ఎన్ని గ్రూపులుగా ఉన్నా.. బయటకు వచ్చాక మాత్రం అంతా కలిసిమెలిసే ఉన్నారు. పార్టీలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ హల్చల్ చేశారు. తనీష్ సినిమా ఈవెంట్‌కు అందరూ వచ్చి ఎంకరేజ్ చేశారు. నందినీ రాయ్ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు.

తాజాగా తేజస్వీ చిట్‌చాట్..

తాజాగా తేజస్వీ చిట్‌చాట్..

తాజాగా తేజస్వీ నెటిజన్లతో చిట్‌చాట్ చేసింది.అందులో భాగంగా ఓ నెటిజన్ ట్రియో బ్యాచ్ ఎలా ఉన్నారు? ఎలాంటి అప్‌డేట్స్ లేవేంటి? అని అడిగాడు. అయితే బ్యాచ్‌లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. మెమోరీస్ ముఖ్యమని చెప్పుకొచ్చింది. ట్రియో అంటే తనీష్, సామ్రాట్, తేజస్వీ అని అర్థమవుతోంది. అయితే ఆమె ఇచ్చిన ఆన్సర్‌ను చూస్తే ఏదో జరిగి ఉంటుందని తెలుస్తోంది.

Recommended Video

RRR Update : S.S.Rajamouli Special Plan For NTR's First Look Teaser
వీడియో కాల్‌లో హౌస్‌మేట్స్

వీడియో కాల్‌లో హౌస్‌మేట్స్

తేజస్వీ చెప్పిన సమాధానానికి సరిపోయేట్టుగా.. ఆమెను దూరం పెట్టారా? అనే అనుమానం రేకెత్తించేలా మిగతా హౌస్‌మేట్స్ అంతా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ వీడియో కాల్‌లో తనీష్, సామ్రాట్, దీప్తి సునయన, గీతా మాధురి, గణేష్, భాను శ్రీ, రోల్ రైడా ఉన్నారు. మరి ఆ ముగ్గురి మధ్య ఏదైనా గొడవలు వచ్చి ఉంటాయా? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X