Bigg Boss Telugu 7: డబ్బు తీసుకోమని అమర్‌కు తేజూ హింట్.. వర్చువల్ కాల్‌లో సైగలు.. వీడియో వైరల్

అంచనాలు లేకుండానే వచ్చినా.. సరికొత్త కాన్సెప్టే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో టీఆర్పీని అందుకుంటోన్న ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఏడో సీజన్ సైతం అదే రీతిలో స్పందనను అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో టాప్ 2లో నిలిచిన అమర్‌దీప్‌కు సంబంధించిన వీడియో ఒకటి సెన్సేషన్ అవుతోంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

Is Tejaswini Gowda Gives Hint To Amardeep About Money Offer in Bigg Boss Telugu 7?

ఆ ఆరుగురి మధ్యనే పోటీ: ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఆరుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో ప్రియాంక జైన్, ప్రశాంత్, అమర్‌దీప్, అర్జున్, శివాజి, యావర్‌లు ట్రోఫి కోసం పోటీ పడుతున్నారు.

ఆదివారం గ్రాండ్ ఫినాలే: దాదాపు పదిహేను వారాల పాటు అలరించిన బిగ్ బాస్ ఏడో సీజన్ డిసెంబర్ 17 అంటే ఆదివారంతో పూర్తి కాబోతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని సమాచారం.

ఆ నలుగురు ఎలిమినేట్: ఆదివారం సాయంత్రం నుంచి ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ను శనివారమే ప్రారంభించారు. ఇందులో కొన్ని పెర్ఫార్మెన్స్‌లు, గెస్టుల ఎంట్రీతో పాటు కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌లను కూడా పూర్తి చేశారు. ఇందులో అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శివాజీలు ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.

Is Tejaswini Gowda Gives Hint To Amardeep About Money Offer in Bigg Boss Telugu 7?

విజేతపై ప్రచారం కూడా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో విజేత అయ్యేది ఎవరన్న దానిపై ఆరంభం నుంచీ ఎన్నో రకాల చర్చలు జరిగాయి. అయితే, చివరి దశకు చేరుకున్న తర్వాత మాత్రం ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు అతడు అమర్‌దీప్‌తో కలిసి టాప్ 2లో నిలవడంతో ప్రశాంత్ గెలుపు ఖాయం అంటున్నారు.

అమర్‌ వీడియో వైరల్‌గా: బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఆదివారం సాయంత్రం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన అసలైన షూట్‌ను జరపబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాప్ 2 కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరికి అతడి భార్య తేజస్విని గౌడ డబ్బు గురించి హిట్ ఇచ్చినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ సైగలతో అనుమానం: రెండు రోజుల క్రితమే బిగ్ బాస్ హౌస్‌లో అమర్‌దీప్ చౌదరి పెళ్లి రోజు జరిగింది. ఆ సమయంలో తేజస్వినితో అతడు వర్చువల్ వీడియో కాల్ మాట్లాడాడు. అప్పుడామె మాట్లాడుతూ మాట్లాడుతూ పెదాలు కదుపుతూ ఏదో మాట్లాడింది. దీంతో అందరూ 'బ్యాగ్ తీసుకో' అని ఆమె చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ వీడియో కలకలం రేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X