BIGG BOSS ట్వీస్ట్ అదుర్స్.. సీక్రెట్ రూమ్ కి వెళ్లేది ఎవరంటే?
Bigg Boss Telugu 8: అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దుమ్మురేపుతోంది. గతంలో ఏ సీజన్ లో చూడని, ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. వాటిని చూస్తే.. కేవలం కంటెస్టెంట్లకే కాదు బీబీ లవర్స్ కూడా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. దీంతో గతంలో ఏ సీజన్ కు రాని హై టీఆర్పీతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ మూడు ఎలిమినేషన్లను విజయవంతంగా కంప్లీట్ చేశారు బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అంతా వేచి చూసేది ఒక్కటే. నాలుగో వారం ఎవరూ ఎలిమినేటర్ అవుతారనే క్యూరియాసిటీయ నెలకొంది.
ఈ తరుణంలో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను అల్రేడీ ఎలిమినేటర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ కంటెస్టెంట్ ను కాపాడుకునేందుకు వేరే వారిని బలి చేయబోతున్నారనీ, లేదా స్పెషల్ ఆఫర్స్ లాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారనీ, లేదా సీక్రెట్ రూమ్ కి పంపించాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో సీక్రెట్ రూం అనేది ఈ వారం తప్పితే.. మళ్లీ యూజ్ చేయడానికి అసలు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ స్రాంగ్ కంటెస్టెంట్ ను సీక్రెట్ రూమ్ కి పంపించే అవకావముందనే టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఈ రియాలిటీ షోలో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పడూ లేని విధంగా కంటెస్టెంట్ల మధ్య కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాటలు, రోమాన్స్, హాగ్గులు, ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల సీన్స్ ఒకే ఒక్క బిగ్ బాస్ షోలోనే కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకూ బిగ్ బాస్ 8 లో విజయవంతంగా మూడు ఎలిమినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ నాలుగో వారం ఎవరూ ఎలిమినేట్ కాబోతున్నరనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం హౌస్ లో కేవలం 11 మంది మిగిలారు. వీరికి నాలుగో వారం నామినేషన్స్ నిర్వహించగా.. ఆరుగురు నామినేట్ అయ్యారు. ఈ నాలుగో వారం నామినేషన్స్‌లో నాగ మణికంఠ, ప్రేరణ, నబీల్, సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగా.. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి బీబీ ఫ్యాన్ ఓ రేంజ్ లో ఓట్లు గుద్దినట్టు తెలుస్తోంది. అధికార ఓటింగ్ ప్రకారం. నబీల్ వారందరిలో టాప్‌లో ఉన్నాడు అల్రేడీ శనివారం ఎపిసోడ్ లో తొలుత నబీల్ సేఫ్ అయ్యారు. ఆ తరువాత స్థానంలో ప్రేరణ, ఆదిత్య, పృథ్వీ, మణికంఠ, సోనియా నిలిచినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ ముద్దు బిడ్డ, స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోనియా ఆకులు ఎలిమినేట్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి సోనియా పూర్తి నెగిటివిటీని మూటగట్టుకుంది. హౌస్ లో సోనియా ఆకుల నేనే పెద్ద తోపు అని ఫీలవ్వడం. నిఖిల్, పృథ్వీలను తన చేతివేళ్లపై ఆడించడం, ఇద్దరు మగ కంటెస్టెంట్లతో ఆమె బిహేవియర్ కాస్త భిన్నంగా ఉండటంతో జనాలు సోనియాపై విరుచుకుపడుతున్నారు. ఆ ఆట తీరు కూడా చాలా వెరైటీ గా ఉంది. ఈ ఎక్స్ ట్రా యాక్టివిటీస్ నచ్చకనే ఆపరేషన్ సోనియాను హౌస్ నుండి ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు కూడా కంకణం కట్టుకున్నటు ఉన్నట్టు ఉన్నారు. దీంతో నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లందరి కంటే.. సోనియాకే అత్యంత తక్కువ ఓట్లు పడ్డాయి. ఇప్పటికే సోనియా ఎలిమినేట్ అయ్యారు.
ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో కూస్తో.. కాస్తో ఎక్స్ ట్రా కంటెంట్ సోనియా వల్లే వస్తోంది. కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేయకుండా లేదా ఆమెను బయటకు పంపించకుండా.. బిగ్‌బాస్ టీమ్ ఎదో పెద్ద ఫ్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వార్తల ప్రకారం ఆమెను ఎలినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్ కు పంపిచడమో లేదా మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీకి అవకాశం కల్పించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే.. గత సీజన్ 7లో రతికను వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి తీసుకొచ్చినట్లుగా సోనియా రీ ఎంట్రీని ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల హౌస్ లో విష్ణు, ప్రుధ్వీల మధ్య ట్రాక్ సెట్ అవుతోంది. కంట్రావర్సీలకు మరోసారి తెర తీయవచ్చు. తిరిగి తనను హౌస్‌లోకి తీసుకుంటారో? లేదా ? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

అలాగే.. వార్త కూడా తెగ వైరలవుతోంది. నాగమణికంఠ ను సీక్రెట్ రూం కి పంపిచాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇటీవల ఆయనను ఇతర కంటెస్టెంట్లు టార్గెట్ చేయడం. దీంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ చాలా మంది కంటెస్టెంట్లు తన గేమ్ నచ్చడం లేదనీ, బిగ్ బాస్ హౌస్ లో జీరో అనే కామెంట్స్ చేశారు. దీంతో నాగార్జున కూడా తన గేమ్ బాగాలేదనీ, తన పద్దతి మార్చుకోవాలని సూచించారు. ఎవరి ఊహించని విధంగా నాగమణికంఠ చివరి వరకు డేంజర్ లోనే ఉంటాడని కింగ్ నాగ్ ప్రకటించారు.
మణికంఠకు కాస్తా రిలీఫ్ ఇవ్వడానికి సీక్రెట్ రూంకి పంపాలని భావించినట్టు తెలుస్తోంది. సీక్రెట్ రూమ్ లోకి పంపడానికి ఈ వారమే చివర అవకాశం. మరో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్న నేపథ్యంలో నాగమణికంఠను సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశముంది. అతడ్ని పంపితే.. బిగ్ బాస్ హౌస్ మరింత ఎమోషనల్ గా మారే అవకాశముంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











