Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగులోకి హాట్ యాంకర్.. టాప్ రెమ్యునరేషన్ డిమాండ్‌తో!
ఇప్పుడు తెలుగు బుల్లితెర వీక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రాండ్ టెలివిజన్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన 8 అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యిన ఈ సెలెబ్రెటీ రియాలిటీ షో ఇండియాలో కూడా హిట్ అయితే ఇండియాలో అతి పెద్ద హిట్ అనేది మన తెలుగులోనే అని చెప్పాలి. అందుకే తెలుగు బిగ్ బాస్ ని మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు.
ఇలా మొత్తం 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన స్టార్ మా యాజమాన్యం ఇప్పుడు బిగ్ బాస్ 8 కి కూడా గట్టి కసరత్తులు చేసారున్నారు. కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో చాలా సర్ప్రైజ్ లు ఉండనుండగా ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపిస్తారు అనేది మరింత ఎగ్జైటింగ్ గా మారింది. అయితే చాలా మంది ప్రముఖ నటీనటులు సోషల్ మీడియా స్టార్స్ పేర్లు కూడా ఈసారి వినిపిస్తుండగా ఓ పాపులర్ తెలుగు యాంకర్ పేరు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

కాగా ఆ యాంకర్ నే విష్ణుప్రియా భీమనేని అట. అయితే ఈసారి సీజన్లో విష్ణు ప్రియా కూడా కనిపించనుంది అని స్ట్రాంగ్ గాసిప్స్ వినిపిస్తుండగా ప్రస్తుతం ఈమెతో కీలక డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయట. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే నటీనటులకు గట్టి రెమ్యునరేషన్ లనే ఇస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇలానే విష్ణు ప్రియాతో రెమ్యునరేషన్ దగ్గర తెగడం లేదట.
ఈమె పేరుని ఎంపిక చేసినప్పటికీ ఈమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. విష్ణు ప్రియకి హౌస్ లో ఉన్నన్ని రోజులు రోజుకి ఇంత అని స్టార్ మా మేకర్స్ కోట్ చేస్తే విష్ణు ప్రియా మాత్రం అంతకు మించి ఎక్కువ డిమాండ్ చేస్తుందట. అందుకే ఇప్పుడు ఈ డిస్కషన్ లే జరుగుతున్నాయని వినికిడి.

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ స్మాల్ స్క్రీన్ మీద అలాగే సోషల్ మీడియాలో కళ్ళు చెదిరే హాట్ షోతో విష్ణు ప్రియాకి మంచి ఫేమ్ అయితే ఉంది. అందుకే ఆమె దీనిని క్యాష్ చేసుకునేందుకు చూస్తున్నట్టుగా రూమర్స్. కాగా ఫైనల్ గా ఈమెతో బేరం ఇంతకీ తెగుతుందో వేచి చూడాలి. ఇంకా ఈసారి సీజన్ ని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తుండగా ఈ సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 8 నుంచి షో గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది అని ప్రస్తుతానికి ఉన్న బజ్.
ఇక ఈసారి సీజన్ నెంబర్ 8 కనుక 8 రిలేటెడ్ గానే బిగ్ బాస్ హౌస్ లో ఇంట్రెస్టింగ్ టాస్క్ లు ఉంటాయని అలాగే మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లో నెంబర్ 8, 8 వచ్చేలా రెండు బ్యాచ్ లుగా హౌస్ లో కనిపిస్తారు అని అలా బరాక్ నుంచి మరో బ్యాచ్ లోకి ఎవరికి కావాల్సిన వారిని ఎంచుకోవచ్చని ఇలా కొత్త కొత్త రూల్స్ తో బిగ్ బాస్ 8 ఎంటర్టైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











