Bigg Boss Telugu 7 బిగ్‌బాస్ షోలోకి పాపులర్ యూట్యూబర్.. స్టార్ కంటెస్టెంట్లను వెనకకు నెట్టి.. లక్కీగా ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ప్రారంభానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే నిర్వాహకులు సెట్, ప్రారంభ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి ఉల్టా పల్టా అంటూ హోస్ట్ నాగార్జున సీజన్ 7 ఎలా ఉండబోతుందననే విషయాన్ని తన ప్రోమోల ద్వారా వెల్లడిస్తున్నారు. రోజు రోజుకు ఈ రియాలిటీ షో ప్రోమోలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. దీంతో బిగ్‌బాస్ తెలుగు 7 ఎవరెవరూ వెళ్తున్నారనే విషయంపై షో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బిగ్‌బాస్ షోలోకి వెళ్తున్న యూట్యూబర్ గురించి వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో అత్యంత భారీ అంచనాల మధ్య ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 3వ తేదీన అట్టహాసంగా ఈ షోను ఏర్పాటు చేసేందుకు సర్వసిద్ధం చేస్తున్నారు. ఈ షోలోకి వచ్చే సెలెబ్రిటీల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. చివరి నిమిషంలో ఒకరిద్దరూ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉండటం, మరికొందరు కొత్తగా యాడ్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. దాంతో ఫైనల్ లిస్టు ఒకట్రెండు రోజుల్లో పూర్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

Is Youtuber Tasty Teja confirmed for Bigg Boss Telugu 7 Show?

బిగ్‌బాస్ తెలుగు 7 షో ప్రారంభం సమీపిస్తుండటంతో ఎంపికైన సెలబ్రిటీలను క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కరోనా సమయంలో సెలబ్రిటీలను 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచారు. కానీ ప్రస్తుతం కంటెస్టెంట్లను కేవలం రెండు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని స్టార్ హోటల్‌కు కంటెస్టెంట్లను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఇప్పటి వరకు మీడియాలో ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల లిస్టు దాదాపు అవాస్తవాలే. మీడియాలో వైరల్ అవుతున్న సంతోషం సురేష్ తదితర వ్యక్తులు షోలోకి రావడం లేదంటూ కొందరు అనధికారికంగా వెల్లడించారు. అయితే ఎవరూ ఊహించని కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారని విషయాన్ని తెలిపారు.

Is Youtuber Tasty Teja confirmed for Bigg Boss Telugu 7 Show?

అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 7లోకి ఇటీవల పాపులారిటీ సాధించిన టేస్టీ తేజ పేరు కన్ఫార్మ్ అయినట్టు సమాచారం. టేస్టీ తేజ యూట్యూబ్‌తో ఫుడ్ రిలేటెడ్ షోలతో మంచి పాపులారిటీ సాధించాడు. సినీ తారలు, ఇతర ప్రముఖులతో షోలు చేస్తూ చలాకీగా కనిపిస్తుంటాడు. టేస్టీ తేజ బిగ్‌బాస్ తెలుగు షోలకి రావడం ఖాయమని చెబుతున్నారు.

Is Youtuber Tasty Teja confirmed for Bigg Boss Telugu 7 Show?

ఇక బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3వ తేదీన అంటే ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ షో ప్రసార వివారాలకు వస్తే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X