ఇస్మార్ట్ శంకర్‌ను ఆటపట్టించిన యాంకర్ ప్రదీప్.. ఇద్దరు హీరోయిన్లతో..
తెలుగు టెలివిజన్ రంగంలో ఫుల్ మస్తీ షోగా పేరున్న కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాకు భారీగా ప్రేక్షకాదరణ ఉంది. బుల్లితెర స్టార్‌గా పేరున్న ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా కొద్దికాలంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సరికొత్త ప్యాటర్న్‌తో కొంచెం టచ్‌లొ ఉంటే చెప్తా సీజన్ 4ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రతీ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రతివారం ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ వేదికపై సందడి చేసి, వాళ్ల అభిమానులకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ వెల్లడించే విధంగా ప్రొగ్రాంను డిజైన్ చేశారు.
బుల్లితెరప్పై క్రేజీ ప్రొగ్రాంగా గుర్తింపు పొందిన కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా కార్యక్రమం గతవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వీ5 అనే టీమ్‌ను హోస్ట్ ప్రదీప్ పరిచయం చేశారు. ఈ బృందంలోని సభ్యులు 10 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు. వీళ్లు ఈ సీజన్‌లో భాగంగా సెలబ్రిటీలతో ఆడి పాడి, చిలిపి ప్రశ్నలు వేస్తారు.

జూలై 13న ప్రసారమయ్యే ఈ షోలో ఇస్మార్ట్ శంకర్ హీరో, హీరోయిన్లు రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ సందడి చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారని తెలిసింది. ఈ షోలో హీరో, హీరోయిన్లను హోస్ట్ ప్రదీప్ సరదాగా, చిలిపి ప్రశ్నలతో ఆటపట్టించినట్టు సమాచారం. ఈ షో జూలై 13 న రాత్రి 9:00 గంటలకు జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానళ్లలో ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











