జబర్దస్త్ నుంచి ఇంద్రజ అవుట్.. ఆమె వెళ్ళిపోవడానికి కారణం అదేనా?
జబర్దస్త్ లో ప్రస్తుతం చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంద్రజ జబర్దస్త్ నుంచి గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇంకోపక్క ఇప్పటివరకుర రెండు రోజులు వచ్చే ఈ కామెడీ షో ఇప్పుడు ఒకరోజుకే పరిమితమయ్యినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై జబర్దస్త్ అనే ఒక కామెడీ షోను తీసుకొచ్చింది మల్లెమాల. అంతా కొత్తవారును తీసుకొని వారిని టీమ్స్ గా విభజించి .. ఇద్దరు స్టార్ జడ్జిలను నియమించి.. ఒక అందాల యాంకర్ తో షో మొదలుపెట్టారు.
యాంకర్ అనసూయ అందం, నాగబాబు, రోజా జడ్జీలుగా జబర్దస్త్ మొదలయ్యింది. ప్రతి గురువారం రాత్రి 9. 30 నిమిషాలకు ఈ షో మొదలయ్యేది. ఇక గంటసేపు ఈ కామెడీ స్కిట్ కోసం మొదట్లో మినీ యుద్ధాలే చేశారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కామెడీ స్కిట్స్ తో కంటెస్టెంట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. వేణు, రాఘవ, చంద్ర, శ్రీను.. ఇలా మొదలైన వీరి పేర్లు.. ఇప్పుడు స్టార్ కమెడియన్స్ గా మారాయి. ఇక ఉన్నాకొద్దీ ఈ షోలో చాలా మార్పులు జరిగాయి.

ఇక జబర్దస్త్ హిట్ అవ్వడంతో దానికి ఎక్స్టా యాడ్ చేసి ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో కొత్త షో వచ్చింది. దానికి రష్మీ యాంకర్ గా మారింది. ఇక రెండు షోస్ కు రోజా, నాగబాబునే జడ్జీలుగా వ్యవహరించేవారు. అలా ఈ రెండు షోస్ .. కొన్నేళ్లు బాగానే అలరించాయి. ఇక ఎప్పుడైతే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నాడో అంతకుముందు ఉన్న కళపోయింది. నెమ్మదిగా కంటెస్టెంట్స్ కూడా సినిమాలు అని, వేరే షోస్ అని, బిగ్ బాస్ అని ఇలా వెళ్ళిపోయి మళ్లీ వెనక్కి రాలేదు.
నాగబాబు వెళ్లినా రోజా కొన్ని ఏళ్లు ఈ షోను తన భుజస్కంధాల మీద నడిపింది.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ షోకు జడ్జిగా వ్యవహరించింది. ఇక ఆమె మంత్రి పదవి అందుకున్నాకా .. జబర్దస్త్ ను వదిలివెళ్ళింది. ఆమెతో పాటే జబర్దస్త్ మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గింది. ఉన్నాకొద్దీ వల్గర్ జోకులు ఎక్కువ అయ్యాయి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం చాలామంది జబర్దస్త్ ప్రోమోస్ తప్ప షో చూడడం లేదు. అందుకే మల్లెమాల ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఒకప్పుడు జబర్దస్త్ హిట్ అవ్వడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ను మొదలుపెట్టిన యాజమాన్యం.. ఇప్పుడు రేటింగ్ తగ్గడంతో ఎక్స్ట్రాను తీసేసి మళ్లీ జబర్దస్త్ ను మొదలుపెట్టనుంది. అంతేకాకుండా రోజా కూడా తిరిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. అందుకే ఇంద్రజ తనంతట తానే తప్పుకుంటుందని సమాచారం. రోజా వెళ్ళాక జడ్జిగా ఆమె ప్లేస్ లో ఇంద్రజ వచ్చింది. ఆమె కూడా రోజాను మరిపించేలా చేసి గుర్తింపును తెచ్చుకుంది.
ఇక ఒకానొక సమయంలో రోజా వస్తే.. ఏ పరిస్థితిలోనైనా నా సీటు ఇవ్వడానికి వెనుకాడను అని చెప్పుకొచ్చిన ఇంద్రజ.. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకోవడానికి సిద్ధమైందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. రోజా మళ్లీ జడ్జిగా వస్తే.. జబర్దస్త్ పూర్వ వైభవాన్ని అందుకుంటుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











