twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం, టీవీ యాంకర్లు ఇళ్లపై ఐటీ దాడులు

    By Srikanya
    |

    Brahmanandam
    హైదరాబాద్: సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురి ఇళ్లల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్న సినీ, టీవీ నటులు, గాయనిల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలు గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, శ్రీనగర్‌కాలనీ, మోతీనగర్‌ ప్రాంతాలకు వెళ్లాయి. సినీ నటుడు బ్రహ్మానందం, టీవీ నటులు, వాఖ్యాతలు ఓంకార్‌, సుమ, ఝాన్సీ, గాయనిలు సునీత, గీతామాధురి ఇళ్లకు సర్వే బృందం అధికారులు వెళ్లారు. ఆదాయపు పన్ను వివరాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్టు తెలిసింది.

    ఐటీ దాడులు చోటుచేసుకున్న సమయంలో సుమ రామోజీ ఫిలింసిటీలోను, సునిత తిరుపతిలోను, గీతామాధురి ఒక మ్యూజికల్ నైట్ షో నిమిత్తం అబుదాబీలోను ఉన్నట్లు తెలిసింది. ఉదయభాను ఇంటికి ఐటీ అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం. ఇటీవల కుమారుడు వివాహం చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన ఇంటి మీద ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని షూటింగ్ నుంచి ఇంటికి చేరుకున్నారు. బుల్లితెరపై తన హవాను సాగిస్తూ, 'జీనియస్' సినిమాతో ఇటీవల దర్శకుడైన ఓంకార్... ఆదాయపు పన్ను అధికారులు తన ఇంటి మీద, కార్యాలయం మీద దాడులు జరిగినప్పుడు సినిమా కార్యాలయంలో ఉన్నట్లు తెలిసింది.

    ఐటీ రిటర్న్స్ సరిగా చెల్లించడంలేదన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. పన్ను ఎగవేతల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఐటీ అధికారులు ఇంతకాలం సినీ నటీనటులు, నిర్మాతలపైనే దృష్టిపెట్టారు. ఈ మధ్య కాలంలో యాంకర్స్, టీవీ నటుల ఆదాయం కూడా బాగానే పెరిగిందని, పన్ను మాత్రం చాలా తక్కువగా చెల్లిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించారని తెలిసింది. సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు 2011-12 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌లో చూపించిన ఆదాయం, చెల్లించిన పన్నును పరిశీలించారు.

    ఐటీ రిటన్స్ లో చూపించిన ఆదాయానికి మించి ఆస్తులు, సంపాదన ఉన్నట్టు గుర్తించిన అధికారులు కొంతమంది రికార్డులు పరిశీలించారు. వారి ఆదాయ మార్గాలను కూడా గుర్తించి, పూర్తి సమాచారంతో గురువారం పలువురు సినీ, టీవీ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఇందుకోసం 40 మంది ఐటీ అధికారులతో 20 ప్రత్యేక బృందాలు ఏర్పడినట్టు తెలిసింది.

    ఇక ఈ దాడులు గురువారం అర్ధరాత్రి దాటేవరకు సోదాలు కొనసాగాయి. ఐటీ రిటన్స్ లో పోల్చి చూసినప్పుడు కొంతమంది వద్ద ఆస్తులకు సంబంధించిన రికార్డులు సరిగాలేవని వెల్లడయింది. కొంతమంది యాంకర్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, సినిమా విజయోత్సవాలకు యాంకరింగ్ చేస్తూ, పలు ప్రారంభోత్సవాలు, కార్యక్షికమాలకు సెలబ్రిటీస్ గా వెళ్లి లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారని ఐటీ అధికారులు గుర్తించారు. టీవీల్లో కూడా కొన్ని కార్యక్షికమాలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారని, ఐటీ రిటర్న్ లో మాత్రం ఆదాయం కొద్దిగానే చూపిస్తూ పన్ను ఎగవేస్తున్నారని తెలిసింది. హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఈ మధ్య కాలంలో తన నటనకు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు.

    English summary
    Brahmanandam greeted unusual visitors this evening. Income-Tax officials today raided on the residences of several celebrities including Brahmanandam. The star comedian has evaded from paying tax to the Government. The other celebrities whom the IT officials raided today include - actress Jhansi, TV anchors Suma, Omkar, singer Geetha Madhuri, singer Sunitha, etc. For the first time in Andhra Pradesh TV celebrities have come under the IT scanner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X