రెచ్చిపోయిన దీప్తి సునైనా, సామ్రాట్.. కళ్లప్పగించి చూడాల్సిందే, తనీష్ కు గాయాలు!
Recommended Video

ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా బిగ్ బాస్ 2 కొనసాగుతోంది. మూవీ మేకింగ్ టాస్క్ లో సభ్యులంతా చురుగ్గా పాల్గొంటున్నారు. అమిత్ దర్శకత్వంలో రూపొందే మూవీ మేకింగ్ టాస్క్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గతః రాత్రి జరిగిన ఎపిసోడ్ లో సామ్రాట్, దీప్తి సునైనా పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక తనీష్, సామ్రాట్ స్విమ్మింగ్ పూల్ సన్నివేశం కూడా వినోదాన్ని అందించే విధంగా ఉంది.

ఒక్కొక్కరు ఒక్కో విధంగా
ఈ మూవీ మేకింగ్ టాస్క్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెర్ఫామ్ చేస్తున్నారు. కౌశల్, నందిని సినిమాలో లవ్ బర్డ్స్ గా కనిపిస్తున్నారు. తేజస్వి కొరియోగ్రాఫర్ గా కనిపిస్తోంది. తమకు కేటాయించబడిన రోల్ ప్రకారం సభ్యులంతా టాక్స్ లో పాల్గొంటున్నారు.

ఎలాంటి ప్రేయసి అంటే
ప్రియుడిని బాగా వాడేసుకుని అతడి పర్స్ ఖాళీ చేసే ప్రేయసి పాత్రలో నందిని నటిస్తోంది. అమిత్ వీరి మధ్య రొమాంటిక్, లవ్ సీన్స్ రూపొందిస్తున్నాడు. ఇక కౌశల్ ప్రేయసి ఏమడిగినా కాదనకుండా వెంటనే చేసిపెట్టే ప్రియుడిగా కనిపిస్తున్నాడు.

తనీష్ కు గాయాలు
సామ్రాట్, తనీష్ మధ్య స్విమ్మింగ్ పూల్ లో పోరాటం జరుగుతుంది. నందిని వలన వీరి మధ్య గొడవ చెలరేగుతుంది. ఈ గొడవలో తనీష్ గాయపడుతాడు. ఆ సన్నివేశాన్ని దర్శకుడు అమిత్, తేజస్వి, రోల్ రైడ్ దగ్గరుండి చక్కగా చిత్రీకరిస్తారు.

మాస్ మసాలా ఐటెం సాంగ్
సామ్రాట్, దీప్తి సునైనా ఇద్దరూ అల్లు అర్జున్ ఆర్య 2 చిత్రంలోని ఐటెం సాంగ్ రింగ రింగాకు డాన్స్ చేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిందే. ఈ సాంగ్ లో దీప్తి సునైనా గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.


Click it and Unblock the Notifications











