twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ను నిషేధించండి.. మా భాషను కించపరుస్తారా?.. సారీతో సీఎంకు నిర్వాహకుల లేఖ

    |

    పలు వివాదాల, అనేక గందరగోళాల మధ్య కొనసాగుతున్న బిగ్‌బాస్ 14 మరో వివాదంలో కూరుకుపోయింది. కంటెస్టెంట్, గాయకుడు కుమార్ సాను కొడుకు జాన్ కుమార్ సాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర వాసులు భగ్గమన్నారు. దాంతో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలకు టెలివిజన్ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇంతకు ఈ వివాదం ఏమిటంటే.

    మరాఠీ భాషపై జాన్ కుమార్ సాను అనుచిత వ్యాఖ్యలు

    మరాఠీ భాషపై జాన్ కుమార్ సాను అనుచిత వ్యాఖ్యలు

    బిగ్‌బాస్ ఇంటిలో నిక్కి తంబోలి, రాహుల్ ఇద్దరు మరాఠీ భాషలో మాట్లాడుకొవడం జరిగింది. అయితే వారిద్దరు తన గురించే మాట్లాడుకొంటున్నారని భావించిన గాయకుడు జాన్ కుమార్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌ షోలో మరాఠీ భాష మాట్లాడకూడదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    జాన్ కుమార్‌ సానుపై భగ్గుమన్న ఎంఎన్ఎస్

    జాన్ కుమార్‌ సానుపై భగ్గుమన్న ఎంఎన్ఎస్

    జాన్ కుమార్ సాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) భగ్గుమన్నది. ఎంఎన్ఎస్ నేత అమేయ కోప్కర్ తీవ్రంగా స్పందించారు. బిగ్‌బాస్ 14 షోను నిలిపివేయాలి. జాన్ కుమార్ సానుపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. బిగ్‌బాస్ షోను నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

    జాన్.. ముంబైలో నీ అంతు చూస్తాం

    జాన్.. ముంబైలో నీ అంతు చూస్తాం

    మరాఠీ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాయకుడు జాన్ కుమార్ సాను ముంబైలో ఎలా కెరీర్ కొనసాగిస్తారో వేచి చూస్తాం. మా ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఎవరినీ వదలం. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగుతాం. అలాంటి కించపరిచే సీన్లను వెంటనే తొలగించాలి అని ఎంఎన్ఎష్ నేత ట్విట్టర్‌లో హెచ్చరించారు.

    టెలివిజన్ ఛానెల్, బిగ్ బాస్ నిర్వాహకుల క్షమాపణ

    టెలివిజన్ ఛానెల్, బిగ్ బాస్ నిర్వాహకుల క్షమాపణ


    దాంతో బిగ్‌బాస్ 14ను ప్రసారం చేస్తున్న నిర్వాహకులు క్షమాపణ చెబుతూ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ మన్నించాలని కోరారు. మరాఠీ భాషపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు. ఎవరి మనోభావాలను దెబ్బ తీస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నాం. మరాఠీ భాష అంటే మాకు ప్రత్యేక గౌరవం ఉంది అంటూ సదరు టెలివిజన్ ఛానెల్ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    Bigg Boss 14 contestant Jaan Kumar Sanu landed in contraversy. He disrespects Marathi language has been taken serious by MNS. MNS asked to ban the show. MNS leader warns Jaan Kumar Sanu and threatened to attack physically.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X