Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోనాల్ గజ్జర్‌తో అవినాష్ రొమాన్స్.. చంపేస్తానని అరియానా వార్నింగ్
బిగ్‌బాస్ ఇంటిలో ఏడోవారం దాదాపు చప్పగానే సాగిపోయింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన క్రమంలో అవినాష్, అరియానా జంటగా చూపించిన ప్రదర్శన, అలాగే కొంటెగా మోనాల్‌తో అవినాష్ చేసిన రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారడమే కాకుండా ప్రేక్షకులకు ఊరట కలిగించింది. అవినాష్, మోనాల్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందంటే..
రాక్షస జాతిలో చేరిపోకూడదా?
మోనాల్ గజ్జర్‌తో అవినాష్ రొమాన్స్ చేస్తూ కనిపించారు. నీవు రాక్షస జాతిలోకి చేరిపోవచ్చుగా అని అవినాష్ అంటే.. లేదు నువ్వే మానవుల జాతిలోకి రాకూడదా అంటూ మోనాల్ ప్రేమగా కోరింది. వీరిద్దరి సంభాషణను తట్టుకోలేక ఆ పక్కనే ఉన్న అరియానా అక్కడి నుంచి లేచిపోతుంటే ఒక్కడే కూర్చుండు అంటూ అవినాష్ సైగ చేశాడు. అరియానాకు మోనాల్‌ను చూపిస్తూ.. మానవుల జాతిలో ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు అంటూ కామెంట్ చేశాడు.
మోనాల్‌తో అతి సన్నిహితంగా
అరియానా దూరంగా వెళ్లి పోతుంటే.. అవినాష్, మోనాల్ సన్నిహితంగా ప్రేమలో మునిగి తేలుతూ కనిపించారు. అయితే మధ్యలో కాఫీ తాగుతారా అంటూ లాస్య కాఫీ తాగుతారా అంటూ అడిగింది. అయితే ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నావు అంటూ అవినాష్ కసరుకొంటే.. రాక్షసులు కాఫీ తాగుతారు అంటూ లాస్య సమాధానం ఇచ్చింది.
అవినాష్‌ను లాగేసుకొని ప్రేమగా మోనాల్
ఇక అవినాష్ లేచిపోతుంటే.. మోనాల్ తనవైపుకు లాగుకొని ప్రేమలో మునిగిపోయింది. మోనాల్ తీరును అవినాష్‌కు చూపిస్తూ.. మోనాల్ వదిలిపెట్టడం లేదంటూ కామెంట్ చేశారు. మన జాతి ప్రయోజనాలు కాపాడు. నీవు జాతి మారవంటే నీకు చంపేస్తాను. చంపి ఆరేస్తాను. ఉతికి ఉతికి ఆరేస్తాను అంటూ అరియానా వార్నింగ్ ఇచ్చింది.
అవినాష్ బాగా వాడేసుకొంటున్నాడంటూ
అరియానా ముందే మోనాల్‌ను వాటేసుకొంటూ రొమాంటిక్‌గా అవినాష్ కనిపించారు. ఆ తర్వాత చార్జింగ్ చేసుకొంటూ వస్తాను అంటూ మోనాల్ ముద్దు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రాక్షస జాతిని అడ్వాన్స్‌గా చేసుకొని అవినాష్ బాగా వాడేసుకొంటున్నారు అంటూ మెహబూబ్ కామెంట్ విసిరారు.
Recommended Video
క్రేజీగా అవినాష్, మోనాల్ కెమిస్ట్రీ
గత కొద్ది రోజులుగా అవినాష్, మోనాల్ మధ్య కొత్త కెమిస్ట్రీ మొదలైంది. టాస్కుల సందర్భంగా ఇద్దరు మంచి కామెడీని, సున్నితమైన హాస్యాన్ని పండిస్తున్నారు. అరియానాను ఈర్ష్యకు గురిచేస్తూ మోనాల్‌తో ఫ్రెండ్లీ లవ్ ట్రాక్‌ను అవినాష్ కొనసాగిస్తున్నారు. అవినాష్, మోనాల్ కెమిస్ట్రీని హోస్ట్ నాగార్జున కూడా కామెంట్ చేయడం తెలిసిందే. ా