మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది.. రాంగోపాల్ వర్మపై జబర్దస్త్ అభి షాకింగ్ కామెంట్స్
గత కొద్దిరోజులు వైరల్ వీడియో గురించి, అలాగే పవర్ స్టార్ సినిమాను తీసిన నేపథ్యంలో ఆర్జీవి గురించి అభినయ్ కృష్ణ అలియాస్ జబర్దస్త్ అభి తన అభిప్రాయాలను, ఉద్దేశాలను తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో గొప్ప దర్శకుడు అనే భావన ఉన్న ఆర్జీవిపై తన ఆవేదనను, అభిమానాన్ని మాటల్లో వ్యక్తం చేశారు. తాజా వీడియోలో జబర్దస్త్ అభి ఏమని అన్నారో మీరే చూడండి..
Recommended Video

పవర్ స్టార్ మూవీ క్లైమాక్స్ చూసి
దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే నాకు ఇష్టం. ఆయన తీసిన శివ చూసి దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. ఇటీవల ఆయన తీస్తున్న సినిమాలు చూస్తే నాకు చాలా బాధనిపించింది. ఇటీవల పవర్ స్టార్ సినిమా చూశాను. ఆ సినిమా క్లైమాక్స్ బిట్‌ను ఎవరో ఫ్రెండ్ పంపిస్తే చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకొంటున్నాను అని అభి అన్నారు.

మీ ప్రతిభ, మీ సత్తా గురించి
పవర్ స్టార్ క్లైమాక్స్‌లో మీరు జర్మన్ ఫిలాసఫర్, మార్క్స్ సిద్దాంతాల గురించి, మాకు నోరు తిరగని, మాకు తెలియని రచయితలు, మెటా ఫిజిక్స్ గురించి మాట్లాడారు. రచయిత్రి ఆయన్ ర్యాండ్ లాంటి రచయతలు గురించి మాట్లాడారు. అలాంటి వ్యక్తి మీరు ఇటీవల తీసిన క్లైమాక్స్, నెకెడ్ లాంటి చూశాను. అలాంటి సినిమాల చూసి బాధపడ్డాను. అది మీది స్టాండర్డ్ కాదు అని అభి పేర్కొన్నారు.

శివ, సర్కార్ ట్రెండ్ సెట్టర్ సినిమాలు..
శివ లాంటి చిత్రంతో సినీ పరిశ్రమలో ట్రెండ్ సృష్టించారు. క్షణక్షణం, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి ఎనో గొప్ప సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు తీయడం మీ టాలెంట్‌కు నిదర్శనం. అలా కాకుండా అమితాబ్‌కు సర్కార్ లాంటి హిట్ అందించిన మీరు మియా మాల్కోవా, ఇతర తక్కువ గ్రేడ్ సినిమాలు తీయడం బాధగా ఉంది అని జబర్దస్త్ అభి తెలిపారు.

కొత్త కొత్త ఆలోచనలతో
మిమ్మల్ని చూసి స్పూర్తి పొందిన యువ దర్శకులు ఇప్పుడు ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. అలాంటి వారికి గురువైన మీరు.. మీకు ఉన్న నాలెడ్జ్, విషయ పరిజానంతో ఎన్నో గొప్ప చిత్రాలు రూపొందించాలి. అది మీకున్న స్టామినా అది. మిమ్మల్ని చూసి కొత్త దర్శకులు తప్పుగా స్ఫూర్తి పొందవద్దు అంటూ అభి ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్టామినాకు తగ్గట్టూ సినిమా తీయండి
అవకాశాలు లేకపోతేనో.. మరే కారణాలతోనో ఇలాంటి సినిమాలు తీయకండి. మిమ్మల్ని చూసి భావితరం దర్శకులు కూడా ఇలా బూతు సినిమాలు తీయకూడదని భావిస్తున్నాను. మిమ్మల్ని చూసి నేర్చుకొనే వాళ్లు చాలా మంది ఉన్నారు. దయచేసి మీ స్టామినా, మీ ఇంటెలెక్చువల్, మీ పవర్‌కు తగినట్టు సినిమాలు తీయండి అంటూ జబర్దస్త్ అభి వేడుకొన్నారు.


Click it and Unblock the Notifications











