అమెరికా అబ్బాయితో యాంకర్ రష్మికి పెళ్లి ఫిక్స్.. ఫ్లోలో రివీల్ చేసిన జబర్దస్త్ కమెడియన్!

బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది. డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమె తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్రెట్ గానే ఆమె పెళ్లి చేసుకోవాలనుకోగా.. ఓ జబర్దస్త్ కమెడియన్ ఫ్లోలో నోరు జారాడు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో చెప్పేశాడు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒడిశాకు చెందిన రష్మి గౌతమ్.. పుట్టి పెరిగిందంతా విశాఖపట్నంలోనే. అయితే సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 2002లో సవ్వడి అనే సినిమాతో కెరియర్ ప్రారంభించింది. కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో.. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోనూ సహాయ పాత్ర పోషించింది. ఇలా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే.. మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తోంది.

Jabaradasth Comedian Bullet Bhasker Revealed Anchor Rashmi Gautam Marriage Details

ప్రస్తుతం 35 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ అందాలకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరపై జబర్దస్త్ షోలో ఎక్కువగా కనిపించిన ఈమె కమెడియన్ సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపింది. కేవలం తెరమీద మాత్రమే వీరిద్దరికీ లవ్ ఉన్నట్లు చూపించగా.. నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంతా అనుకున్నారు. కాదని చాలా సార్లే చెప్పినా కొంత మంది మాత్రం ఇప్పటికీ నమ్మట్లేదు. వారిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుండని కూడా కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఈమె పెళ్లికి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ముఖ్యంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఓ స్కిట్ వేశాడు. స్కిట్ లో భాగంగానే రాజుగా కనిపించిన ఈయన.. ముందుగా తాను తేల్చాల్సిన ఓ చిన్న లెక్క ఉందని తన అసిస్టెంట్ కు చెబుతూ.. యాంకర్ రష్మి వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే.. మన బాబు బాగానే జీతాలు ఇస్తున్నట్టున్నాడు.. ప్రతీ వీడియో కింద కామెంట్లు చూస్తుంటేనే అర్థం అవుతుందంటూ సుధీర్ పై పంచ్ వేశాడు. అదంతా విన్న రష్మి నవ్వగా... వాడెవడో ఫస్ట్ కామెంట్.. బుల్లెట్ భాస్కర్ గాడికి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందంటూ రాసుకొచ్చాడని కామెంట్లు పెడితే భయపడడానికి తాను ఘోటు కాదు లయను అని చెప్పుకొచ్చాడు.

Jabaradasth Comedian Bullet Bhasker Revealed Anchor Rashmi Gautam Marriage Details

ఇక ఆ తర్వాత స్టేజీ మీదకు వెళ్లిన బుల్లెట్ భాస్కర్ ను ఆయన అసిస్టెంట్.. నాకో డౌటయ్యా సుధీర్ కు, రష్మికి పెళ్లి అవుతుందా అంటూ అడిగాడు. దీనికి బుల్లెట్ భాస్కర్ ఎందుకు కాదు.. నిన్నే జాతకాలు చూయించాను.. వారిద్దరికీ కచ్చితంగా పెళ్లి అవుతందన్నారని చెబుతాడు. అయితే రష్మి అమెరికా వాడిని చేసుకోబోతుండగా.. సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడని వివరించాడు. ఇది స్కిట్ పరంగానే అయినా.. నిజంగానే రష్మి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X