Ritu Chowdary: నా క్యారెక్టర్ అదే.. డబ్బు కోసమే అలా.. రీతూ చౌదరి కామెంట్స్ వైరల్!

Ritu Chaudhary: జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కళాకారులకు వేదికగా మారింది. ఈ కామెడీ షో ద్వారా పాపులాటి తెచ్చుకున్న వారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో రాణిస్తున్నారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి ఒకరు. తన కామెడీతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా రీతూ చౌదరికి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటో ఓ లూక్కెయ్యండి.‌

జబర్దస్త్ నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ భామ మొదట సీరియల్స్ లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత ఈ ఫేమ్ తో జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చింది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది రీతూ చౌదరి. జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ ల్లో నటించడం ద్వారా త్వరగా పాపులారిటీని సంపాదించుకుంది రీతు చౌదరి. ఆ తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ షో', 'ఫ్యామిలీ స్టార్' వంటి షోల్లో కూడా పనిచేసింది. దీంతో మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.

Jabardast actress Ritu Chaudhary says faced a lot of Problems her comments going viral

రీతూ షోల్లో యాంకర్‌ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తోంది. ఇక ఈ అమ్మడు బుల్లితెర పైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు హంగామా మామూలుగా ఉండదు. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ఇస్తూ.. తన ఫ్యాన్స్ ను పలుకరిస్తోంది.
తాజాగా ఈమె 'వేరే లెవల్ ఆఫీస్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది రీతూ చౌదరి.

రీతూ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని, ఈ సమయంలో తాను ఎక్కువగా సీరియల్స్ లో నటించాల్సి వచ్చిందని అన్నారు. కెరీర్ ప్రారంభంలో ఇంటి రెంట్ కట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేదని, ఆ సమయంలో సీరియస్ లలో చిన్న చిన్న పాత్రలలో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ప్రస్తుతం పరిస్థితి మారిందని, తాను సినిమాలలో మంచి క్యారెక్టర్ల కోసం వేచి చూస్తున్నానని చెప్పుకొచ్చింది.

Jabardast actress Ritu Chaudhary says faced a lot of Problems her comments going viral

ప్రస్తుతం తాను 'వేరే లెవెల్ ఆఫీస్' వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని రీతూ తెలిపారు. వెబ్ సిరీస్ లో తన క్యారెక్టర్ గురించి చెబుతూ అందులో క్యారెక్టర్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. ఆ క్యారెక్టర్ తన రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉందని, తనని బయట ఎలా చూస్తారో .. ఆ వెబ్ సిరీస్ లో కూడా అలాగానే చూస్తారని, ఆ పాత్ర చేసేటప్పుడు తాను చాలా ఎంజాయ్ చేశానని తెలిపింది. కొన్ని సార్లు తాను మాట్లాడాలంటే ఫిల్టర్స్ కావాల్సిందే. కానీ, నాకు కొంచెం నోటి దూల ఎక్కువ అని కామెంట్స్ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను షోలు, వెబ్ సిరీస్‌లతో పాటు బిజినెస్ కూడా చేస్తున్నాననీ, తనకు రీసెంట్‌గా రెండు సినిమా ఛాన్స్‌లు వచ్చాయనీ తెలిపింది. ఇదెలా ఉంటే.. రీతూ చౌదరి ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు వినిపిస్తుంది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ స్కామ్ లో రీతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నిజానిజాలు వెలుగులో రాబోతున్నట్టు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X