Jabardasth కిర్రాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్.. అనుకున్నట్లే అందమైన అమ్మాయితో పెళ్లి.. ఫొటోస్ వైరల్

జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా క్రేజ్ అందుకున్న వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. మిమిక్రి ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న ఆర్పీ తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. మొదట దర్శకుడు అవ్వాలని వచ్చిన కిరాక్ ఆర్పి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా కెరీర్ సెట్ చేసుకున్నాడు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాడు. ఇక మొత్తానికి కిర్రాక్ కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ పార్టీకి కొంత మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 జబర్దస్త్ ద్వారా..

జబర్దస్త్ ద్వారా..

చిన్నప్పటి నుంచి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకోవాలి అనే కిరాక్ ఆర్పి సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత ఈవెంట్స్ లలో మిమిక్రి ఆర్టిస్ట్ గా మారి జీవితాన్ని కొనసాగించాడు. మొత్తానికి తన టాలెంట్ నిరూపించుకున్న ఆర్పీ జబర్దస్త్ ద్వారా అవకాశం రావడంతో అక్కడి కొన్నేళ్లపాటు ఇతర కమెడియన్స్ తో కలిసి మంచి కామెడీ పండించాడు. కొన్నాళ్ళకు తనకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని టీమ్ లీడర్ కూడా అయ్యాడు.

నాగబాబు వెంటనే..

నాగబాబు వెంటనే..

కొన్నాళ్ళకు జబర్దస్త్ టీమ్ మేనేజ్మెంట్ తో కొన్ని విభేదాలు రావడంతో జడ్జిగా కొనసాగుతున్న నాగబాబు అక్కడ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక నాగబాబు బయటకు వెళ్లి పోవడంతో ఆయన వెంటనే మరి కొంత మంది కమెడియన్స్ కూడా బయటకు వచ్చేశారు. వారిలో కిరాక్ ఆర్పి కూడా ఉన్నాడు. కిరాక్ ఆర్పి అదిరింది షో లో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేశాడు. అక్కడ కూడా అతనికి మంచి గుర్తింపు లబించింది.

దర్శకుడిగా కూడా..

దర్శకుడిగా కూడా..


ఇక కామెడీ షో అనంతరం తను అనుకున్న పని చేయాలి అని దర్శకుడిగా మారాడు. ఆ మధ్య కాలంలో ఒక సినిమాను కూడా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇటీవల ఒక సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నాగబాబు చేతుల మీదుగా ఆ సినిమా లాంచ్ అయ్యింది.

ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం

ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం


అయితే అనుకున్నట్లుగానే కిరాక్ ఆర్పీ తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. నెల్లూరుకు చెందిన లక్ష్మీ అనే అమ్మాయిని కిరాక్ ఆర్పీ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. మొత్తానికి ఇంట్లో వారిని ఒప్పించే కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ అయితే పూర్తిచేసుకున్నాడు. ఇక త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్న ట్లుగా తెలుస్తోంది.

Recommended Video

F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu
వేడుకలో నాగబాబు నిహారిక

వేడుకలో నాగబాబు నిహారిక

కిరాక్ ఆర్పి ప్రేమించిన అమ్మాయి లక్ష్మి నెల్లూరులో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. నాగబాబు అలాగే ఆయన కూతురు నిహారిక తో పాటు మరి కొంతమంది జబర్దస్త్ కామెడీ నటులు, హేమ వంటి వారు ఎంగేజ్మెంట్ లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X