twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్దస్త్ షో నాగబాబు, రోజా, కమెడియన్ల రెమ్యూనరేషన్ డీటేల్స్ లీక్!

    |

    Recommended Video

    Jabardast Comedy Show Judges,Team Leaders Remuneration Details || Filmibeat Telugu

    సినిమా, టీవీ రంగానికి చెందిన స్టార్లు, కమెడియన్లు, నటులు, యాంకర్లు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే అంశంలో ప్రజల్లో ఎప్పుడూ ఓ ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వీరి రెమ్యూనరేషన్ వివరాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అటు నిర్మాతలు కానీ, ఇటు యాక్టర్లు కానీ ఈ వివరాలు అఫీషియల్‌గా బయట పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఇలాంటి విషయాలు ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒక విధంగా లీక్ అవుతూనే ఉంటాయి.

    తెలుగు టెలివిన్ రంగంలో గత కొన్నేళ్లుగా టాప్ రేటింగ్స్‌తో దూసుకెళుతున్న షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఈ షో పుణ్యమా అని ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో అవకాశం దక్కించుకుని దూసుకెళుతున్నారు. కొందరు ఈ షో ద్వారా సూపర్ పాపులర్ అయి బాగా సంపాదించే స్థాయికి ఎదిగారు. తాజాగా ఈ షోకు జడ్జిలుగా ఉంటున్న నాగబాబు, రోజాతో పాటు కమెడియన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి.

    హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నాగ బాబు, రోజా

    హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నాగ బాబు, రోజా

    జబర్దస్త్, ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్ షోకు మొదటి నుంచి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు, రోజా. ఒకప్పుడు ఆర్థికంగా చితికి పోయిన మెగాబ్రదర్ ఈ షో వల్ల కాస్త తేరుకున్నారని చెబుతుంటారు. రోజా ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతూ కూడా ఈ షో కంటిన్యూ చేశారు. తెలుగు మీడియా రిపోర్ట్స్ ప్రకారం.... రోజా ఈ షో ద్వారా నెలకు రూ. 16 లక్షలు, నాగబాబు నెలకు 20 లక్షల అందుకుంటున్నట్లు టాక్.

    యాంకర్స్ అనసూయ, రష్మి

    యాంకర్స్ అనసూయ, రష్మి

    జబర్దస్త్ మొదలైనపుడు యంకర్ అనసూయ మాత్రమే ఉండే వారు. తర్వాత ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా మొదలవ్వడంతో రష్మి కూడా ఈ షోలో భాగం అయ్యారు. వీరు యాంకరింగ్ చేసినందుకు మంచి మొత్తమే అందుకుంటున్నారు. అనసూయ నెలకు దాదాపు రూ. 4 లక్షలు, రష్మి దాదాపు రూ. 3.5 లక్షలు అందుకుంటారని టాక్.

    సుడిగాలి సుధీర్ టీమ్

    సుడిగాలి సుధీర్ టీమ్

    టీమ్స్ వైజ్ చూసుకుంటే ఒకే టీములో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునే వారు ఎక్కువగా ఉన్న టీమ్ సుడిగాలి సుధీర్ టీమ్. వీరిలో టీమ్ లీడర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్ రూ. 3.5 లక్షలు, రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, గెటప్ శ్రీను 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    టీమ్ లీడర్లలో టాప్ చమ్మక్ చంద్ర

    టీమ్ లీడర్లలో టాప్ చమ్మక్ చంద్ర

    టీమ్ లీడర్లలో చమ్మక్ చంద్ర అత్యధికంగా నెలకు రూ. 4 లక్షల వరకు అందుకుంటున్నారని, హైపర్ ఆది రూ. 3 లక్షలు, అధిరే అభిమా రూ. 3 లక్షలు, రాకెట్ రాఘవ రూ. 2.5 లక్షలు, కిరాక్ ఆర్పీ 2.5 లక్షలు, భాస్కర్ రూ. 2 లక్షలు అందుకుంటున్నారట. ఇతర కమెడియన్లు వారి స్థాయి, టాలెంట్ బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    English summary
    Jabardast Comedy Show Judges, Team Leaders Remuneration Details leaked. Nagababu earns Rs. 20 lakhs, Roja earns Rs. 14 lakhs per month. Other Team Leaders and Comedians Remuneration Rs. 1 lakh to Rs. 4 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X