గోరంట్ల, పోసాని, రోజా మాటలు మీ పిల్లలకు నేర్పిస్తారా? యాంకర్ శ్యామలని చీల్చి చెండాడిన ఆర్పీ!
మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా సినిమా లేదా ఎంటర్టైన్మెంట్ రంగానికి చేసిన ప్రముఖులు అత్యధికంగా ఇన్వాల్వ్ అయ్యిన రాష్ట్రం మాత్రం ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పవచ్చు. కాగా గడిచిన కొన్నేళ్లలోనే చాలామంది సినీ తారలు ఏపీకి సంబంధించి చాలా యాక్టీవ్ గానే కనిపిస్తూ వచ్చారు. ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన అలాగే వైసీపీ పార్టీలులో సినీ ప్రముఖులు ఉన్నారు.
అయితే ఎక్కువగా సినీ ప్రముఖుల నడుమ టార్గెట్ మాత్రం జనసేన, వైసీపీ నేతలకు మధ్య ఓ రేంజ్ లో వాగ్వాదం నడుస్తూ వస్తుంది. అయితే ఇటీవల వైసీపీకి ప్రముఖ యాంకర్ శ్యామల చేరడం ఆమె చేరడంతోనే అధికార ప్రతినిధిగా కూడా మారడం జరిగిపోయాయి. అయితే ఈమె ఈ పదవి అందుకున్న తర్వాత చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక రీసెంట్ గానే టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళీ అరెస్ట్ కావడం జరిగిన విషయం తెలిసిందే. అయితే పోసాని గతంలో ప్రస్తుత డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తన భార్యపై పిల్లలపై కూడా దారుణాతి దారుణమైన హేయమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అలాంటి పోసానిని ఏపీ పోలీస్ తెలంగాణ వచ్చి మరీ అరెస్ట్ చేశారు.
అయితే ఈ విషయంలో పవన్ అభిమానులు ఆనందం కూడా వ్యక్తం చేస్తుండగా దీనిని యాంకర్ శ్యామల ఖండిస్తూ పోసాని అరెస్ట్ పై స్పందించడం జరిగింది. కాగా పోసాని అరెస్ట్ ని ఆమె సహా తన పార్టీ కూడా ఖండిస్తుంది అని తెలిపారు. ఇక దీనితో జబర్దస్త్ ఫేమ్ ఆర్పీ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పోసాని అరెస్ట్ ని ఈమె సహా తన పార్టీ సభ్యులు కూడా ఖండిస్తూ తన వెనుక ఉన్నారు అంటే వీరంతా పోసాని చేసిన వ్యాఖ్యల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారా అంటూ ఆర్పీ ప్రశ్నించాడు. సో ఇలా సమర్ధించే శ్యామల అదే పోసాని, కొడాలి నాని, రోజా, వంశీ లాంటి వారు పలికే అందమైన పదాలు తీసుకెళ్లి మీ పిల్లలకి నేర్పించాలి అని సెటైర్స్ చేసాడు.
ప్రతీ రోజు ఉదయం వీరంతా చెప్పిన నీతి వ్యాఖ్యలు శ్యామల తన పిల్లలకి నేర్పించగలడా అంటూ సరైన పాయింట్స్ తో చీల్చి చెండాడేసాడు. ఇంత పచ్చిగా అలాంటి పోసానికి ఎలా సపోర్ట్ చేస్తున్నారని, ఈ లెక్కన వారు మాట్లాడిన భాష, మాటలు మీ పిల్లలకి నేర్పించగలరా అంటూ ఆర్పీ చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఇక ఇదే వీడియోలో మధ్యలో మరో అద్భుతమైన వ్యక్తి గోరంట్ల మాధవ్ పై కూడా సెటైర్స్ వేసాడు. అలాంటి వారివి మాత్రం పిల్లలకి అసలు నేర్పించొద్దు అంటూ ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ వీడియో మాత్రం యాంకర్ శ్యామల అండ్ కో ఎవరైతే పోసాని విషయంలో బ్యాక్ చేస్తున్నారో అందరికీ ఆర్పీ మరోసారి స్ట్రైక్ చేసాడు అంటూ సోషల్ మీడియాలో మిగతా నెటిజన్స్ ఆర్పీ కామెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











