ఇంద్రజపై నోరు పారేసుకున్న బుల్లెట్ భాస్కర్.. నోర్మూయించిన ఖుష్బూ
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన పలువురు కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకడు. అయితే తాజాగా ఈ కమెడియన్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజను ఆంటీ అంటూ నోరు జారాడు. అంతేకాదు ఏకంగా మరో సీనియర్ నటి ఖుష్బూను అమ్మమ్మ అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ఖుష్బూ నుంచి ఊహించని రియాక్షన్ వచ్చింది. తమను అలా పిలవడంపై స్పందించి, బుల్లెట్ భాస్కర్ మళ్లీ నోరెత్తకుండా చేసింది ఖుష్బూ. ఇంతకీ బుల్లెట్ భాస్కర్ కు ఖుష్బూ ఎలాంటి ఝలక్ ఇచ్చిందో ఓ లుక్కేద్దాం పదండి.
చాలా కాలం నుంచి బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న టెలివిజన్ షో జబర్దస్త్. పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకులను జబర్దస్త్ గా నవ్విస్తూ, మంచి టిఆర్పి రేటింగ్ తో ఇప్పటికీ దూసుకెళ్తోంది ఈ షో. ఇక ఇందులో యాంకర్ గా రష్మీ, జడ్జ్ లు గా ఖుష్బూ, కృష్ణ భగవాన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. షోలో కంటెస్టెంట్ల కామెడీ స్కిట్లు మాత్రమే కాదు వారి ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను అలరించడంలో కీలక పాత్రను పోషిస్తాయి.

కొన్ని స్కిట్స్ మధ్యలోనే జడ్జీలు పంచ్ ఏంటో ముందే చెప్పడం, కంటెస్టెంట్స్ పంచులకు సమాధానం ఇవ్వడం వంటి సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. తాజాగా జబర్దస్త్ నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ సీనియర్ నటి ఇంద్రజను ఆంటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ప్రోమో ప్రకారం బుల్లెట్ భాస్కర్ స్కిట్ స్టార్ట్ అవ్వగానే అతనికి ఫోన్ వస్తుంది. ఎవరు అని అడిగితే ఇంద్రజ గారు అని సమాధానం చెబుతాదు నరేష్.
ఏంటట అంటే సినిమా ఆఫర్ కావాలంటూ ఫోన్ ను బుల్లెట్ భాస్కర్ చేతికిస్తాడు. వెంటనే బుల్లెట్ భాస్కర్ ఆ ఫోన్ అందుకుని హలో ఇందు ఆంటీ? అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఖుష్బూ ఏంటి ఆంటీనా? అని నవ్వుతూ ఇంద్రజకు ఫోన్ చేయమని ఆర్డర్ వేసింది. అదేమీ పట్టించుకోకుండా బుల్లెట్ భాస్కర్ ఫోన్ లో ఇంద్రజకు స్టోరీ చెప్తున్నట్టుగా ప్రోమోలో చూపించారు.
ఇక ఆ స్టోరీలో ఇంద్రజ నాయనమ్మ, ఖుష్బూ అమ్మమ్మ పాత్రలు పోషిస్తారని బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు. ఇద్దరు భామల ముద్దుల మనవడు అనేది మూవీ టైటిల్ అని భాస్కర్ రివీల్ చేయగానే ఖుష్బూ సెటైర్ వేసింది. ఫైవ్ అనే నెంబర్ ఉన్న మార్క్స్ బోర్డ్ ని చూపిస్తూ, ఇంతకంటే తక్కువ మార్కులు ఉన్న బోర్డు ఏదైనా ఉందా అంటూ ఇన్ డైరెక్ట్ గా బుల్లెట్ భాస్కర్ ను హెచ్చరించినట్టుగా చూపించారు.
ఈ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ చేసిన కామెడీకి జడ్జెస్ తో పాటు అందరూ తెగ నవ్వేశారు. మరి ప్రోమోనే ఇలా ఉంటే పూర్తి స్కిట్ ఎలా ఉంటుందో చూడాలి అనే ఇంట్రెస్ట్ ని పెంచేసింది ఈ లేటెస్ట్ ప్రోమో. కాగా జబర్దస్త్ ప్రతివారం శుక్రవారం, శనివారంలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ప్రోమో జూలై 12, 13 తేదీలకు సంబంధించింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











