Jabardasth Varsha: ‘నేను ప్రతివతనే.. కాదంటే అగ్నిగుండంలో దూకుతా’
Emmanuel- Varsha: జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులు పరిచయమయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికీ చాలా గాసిప్స్ వస్తున్నాయి. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ సహా పలు షోలలో కూడా వీరిద్దరూ తమ మధ్య ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారు. బయటకు కూడా ఒకరిపై ఒకరు తమ మధ్య ఉన్న ప్రేమ, అనుబంధంపై చాలా సందర్భాల్లో బయటపెట్టారు. తాజాగా ' నేను ప్రతివతనే.. కాదంటే అగ్నిగుండంలో దూకుతా' అంటూ వర్ష ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఈ క్రమంలో రష్మి కూడా వర్షపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ?
గత దశాబ్దకాలంగా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న షో ఏకైక మెగా కామెడీ షో జబర్దస్త్ (Jabardast). దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా.. కంటెస్టెంట్స్, యాంకర్లు, జడ్జిలు అందరూ మారిపోయినా జబర్దస్త్ షోకి మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎంతోమంది కళకారుల జీవితాలను మార్చేసిన షోగా జబర్దస్త్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు టీవీ కార్యక్రమాలలో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న షోగా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జబర్దస్త్ సంబంధించిన లేటెస్ట్ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ చేసిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లెటెస్ట్ జబర్దస్త్ ప్రోమోలో ప్రారంభంలోనే నూకరాజు, తాగుబోతు రమేశ్ తమ స్కిట్ తో వస్తారు. అందులో తాగుబోతు రమేశ్ .. 'నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, నెలకు రూ.40,000 జీతం' అని చెప్పగా.. 'సాఫ్ట్వేర్ ఇంజనీర్, దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేనని.. ఎప్పుడు పడిపోతాయో తెలియదు' అంటూ నూకరాజు అదిరిపోయే పంచ్ విసురుతాడు. ఆ తర్వాత పటాస్ ఫైమా టీంతో ఎంట్రీ ఇస్తుంది. 'టీ తెండ్రా'అని ఫైమా అడగగా.. టీ అంటే క్యాపిటల్ టీనా.. లేక స్మాల్ టీ నా అని దిమ్మతిరిగేపోయే సమాధానమిస్తారు టీం మెంబర్స్. ఇక బుల్లెట్ భాస్కర్ ని పెళ్లి చేసుకుంటానంటూ ఫైమా వేధిస్తూ కడుపుబ్బా నవ్విస్తోంది.
ఇక ఆ తర్వాత తామిద్దరం మొగుడు పెళ్ళాలమని వర్ష, ఇమ్మాన్యుయేల్ లు స్టేజ్ పైకి వస్తారు. ' నీతో స్కిట్ చేస్తుంటే.. ఏదో కొత్త కొత్తగా ఉంది ' అని వర్షా అంటుంది. ఈ మధ్య కొత్త కొత్త రుచులు మరిగాక.. మాతో చేయాలంటే కొత్తగానే ఉంటుంది' అంటారు ఇమ్మానుయేల్. ఇద్దరు పెళ్లికి ముందు ప్రేమ గురించి మాట్లాడుకుంటుండగా.. నా ఇంటి ఎదురుగా ఉన్న శివాజీ గారు.. రోజు పాల ప్యాకెట్ల కోసం ఆయన చిన్న టవల్ కట్టుకుని బయటకు వస్తాడు. కానీ, ఏ రోజు కూడా ఆయనను చూడలేదు అంటుంది వర్ష. కానీ, చిన్న టవల్ మాత్రం రోజు చూస్తున్నావా? అంటూ కుష్బు ప్రశ్నిస్తుంది.
దీంతో నన్ను అనుమానిస్తున్నారా.. ఇక్కడ నిప్పుల గుండం వేయండి.. ఆ నిప్పుల గుండంలో దూకి .. పతివ్రతలా లేచొస్తానని వర్షా చెప్పగా.. ఒసేయ్ కాలిపోతావే అంటూ రష్మీ పంచ్ వేస్తుంది. అసలు ఏం తెలియనట్టు ఇమ్మాన్యుయేల్.. 'ఎంత లక్కు ఉంటే ఇలాంటి పతివ్రత నా భార్యగా వస్తుంది'. అనడంతో నవ్వుల పువ్వులు పూశాయి. అలా మొత్తానికి వీరి స్కిట్ హైలెట్ గా నిలించింది.


Click it and Unblock the Notifications











