సుకుమార్ వివాదంపై జబర్దస్త్ మహేష్ స్పందన.. ఆయన నన్ను కొట్టలేదు!

By Rajababu

రంగస్థలం సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరిపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రాంచరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ ధరించిన పాత్రలకు మంచి ప్రజాదరణ లభిస్తున్నది. ఈ చిత్రంలో రాంచరణ్‌ స్నేహితుడిగా నటించిన జబర్దస్త్ మహేష్ కూడా మంచి పేరును సంపాదించుకొన్నాడు. రంగస్థలంలో లభించిన పాత్రను అద్భుతంగా పోషించాడని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, తాజాగా సక్సెస్ మీట్‌లో జరిగిన ఓ ఘటనపై జబర్దస్త్ మహేస్ స్పందించాడు.

నాకే అవకాశం ఇచ్చాడు

నాకే అవకాశం ఇచ్చాడు

రంగస్థలం రిలీజ్‌కు ముందు సెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా అంచనాలకు మించిన పెర్ఫార్మెన్స్‌ను మహేష్ ఇచ్చాడు. అతడికి నేను అవకాశం ఇచ్చాను అని భావించే వాడిని. సినిమా చూసిన తర్వాత మహేషే నాకు అవకాశం ఇచ్చాడు అనే భావన కలిగింది అని దర్శకుడు సుకుమార్ పేర్కొన్నారు.

డైలాగ్స్, యాక్టింగ్‌తో ఆకట్టుకొన్న మహేష్

డైలాగ్స్, యాక్టింగ్‌తో ఆకట్టుకొన్న మహేష్

రంగస్థలం సినిమా చూసిన తర్వాత మహేష్ ప్రతీ ఒక్కరి ఆదరణను చూరగొన్నాడు. ప్రధానంగా రాంచరణ్ తండ్రిగా నటించిన నరేష్‌ను ఉద్దేశించి గ్రామపెద్ద చేసిన వ్యాఖ్యల అనంతరం వచ్చే సీన్‌లో మహేష్ తన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌తో అదరగొట్టాడు అని ప్రశంసల లభించాయి.

వివాదంపై మహేష్ వివరణ

వివాదంపై మహేష్ వివరణ

ఇక ఆది పినిశెట్టి మరణించిన తర్వాత వచ్చే సీన్‌లో మహేష్ నటన హైలెట్‌గా నిలిచింది. రంగస్థలం సినిమాకు ముందు చిన్నచితక పాత్రలతో నెట్టుకొచ్చిన మహేష్‌కు లైఫ్‌కు సపోర్ట్‌గా నిలిచే రోల్‌ను సుకుమార్ అందించారని చెప్పవచ్చు. రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌లో ఓ చిన్న సంఘటన జరిగింది. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ ఇటీవల మహేష్ వివరణ ఇచ్చారు.

సున్నితంగా మందలింపు

సున్నితంగా మందలింపు

తనకు గొప్ప అవకాశం కల్పించిన సుకుమార్‌ కాళ్లకు మహేష్ మొక్కాడు. సుకుమార్ ఏదో ఆలోచిస్తూ ఉండగా ఇది జరిగింది. అంతలోనే తేరుకొన్న సుకుమార్ వారించబోయాడు. ఆ క్రమంలో సున్నితంగా మందలించాడు. అయితే ఆ సందర్భంగా మహేష్‌ను సుకుమార్ కొట్టాడనే ప్రచారం మీడియాలో జరిగింది.

కొట్టినా సంతోషించేవాడిని

కొట్టినా సంతోషించేవాడిని

నాకు గొప్ప పాత్రను ఇచ్చిన సుకుమార్ కాళ్లకు నమస్కరించబోయాను. ఆ సమయంలో నన్ను సుకుమార్ వారించాడు. కానీ కొట్టలేదు. ఒకవేళ కొట్టినా ఇంకా సంతోషించేవాడిని అని మహేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X