జబర్దస్త్‌లో చలాకీ చంటీకి వెన్నుపోట్లు.. బయటపెట్టిన హైపర్ ఆది.. చమ్మక్ చంద్ర, అధిరే అభి, రాఘవ కంటతడి
దశాబ్దానికిపైగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఈ షో గురించి టీవీ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా మంచి కామెడీని అందిస్తూ వస్తోంది. అయితే 2025 వరకు జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమై 12 ఏళ్లు గడించింది. ఈ సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్స్ ఆగస్టు 8న, ఆగస్టు 9న ఈటీవీ విన్ లో రాత్రి 9:30కు ప్రసారం కానుంది. ఇక తాజాగా ఆ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో హైపర్ ఆది జబర్దస్త్ మొదటి టీమ్ లీడర్ల గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా చలాకీ చంటికి వెన్నుపోట్లు పొడిచారని బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ కామెడీ షో ప్రారంభంలో స్కిట్స్ పండించిన టీమ్ లీడర్లు, ఆర్టిస్ట్ లు, యాంకర్స్, జడ్జీలు జబర్దస్త్ 12 ఏళ్ల మెగా సెలబ్రేషన్స్ కు హాజరవడం విశేషం. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. 'ఈ జబర్దస్త్ జర్నీలో చాలా ప్రధానమైన ఘట్టం అధిరే అభి, చమ్మక్ చంద్ర, వేణు ఎల్దండి, చలాకీ చంటి, రాఘవ, ధన్ రాజ్ తో ప్రారంభమైంది. అయితే వీరి వెనకాలే వచ్చిన ఆర్టిస్టులు వారికి వెన్నుపోటు పొడిచారు. వెనుక వచ్చిన వారు కట్టప్పలు, అలాగనీ ముందున్న వారు బాహుబలిలేం కాదు. కంటెస్టెంట్స్ అందరూ టీమ్ లీడర్లకు వెన్ను పోటు పొడిచిన వారే. కానీ ఒక్క రచ్చరవి అన్నే ఆయనకు ఆయనే వెన్నుపోటు పొడుచుకున్నారు.

ఇక జబర్దస్త్ లో అత్యధికంగా వెన్నుపోట్లకు గురైంది చలాకీ చంటి. జబర్దస్త్ లో ఉన్న కత్తులన్నీ చలాకీ చంటికి దిగిపోయాయి. ఆల్మోస్ట్ వీపు జల్లెడ అయ్యింది.' అని చెప్పుకొచ్చారు. దీనిపై చలాకీ చంటి కూడా ఆసక్తికరంగా స్పందించారు. 'నాకు వెన్నుపోటు పొడచిన వారిలో అతి ముఖ్యుడు శకలక శంకర్. పెయింట్స్ వేసుకునే వాడిని తీసుకొచ్చి ఆర్టిస్ట్ ను చేశాను. నాకే వెన్నుపోటు పొడిచాడు.' అని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై నాగబాబు కూడా స్పందించారు. 'అసలు మీ అందరి కంటే నాకే ఎక్కువ వెన్నుపోట్లు పొడిచారు. వీపు జల్లెడ కాదు. వీరే స్కిన్ వేసుకుని తిరిగే వరకు తీసుకొచ్చారు.' అని ఫన్నీగా బదులిచ్చారు.
మరోవైపు హైపర్ ఆది సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ లవ్ స్టోరీ.. అలాగే జబర్దస్త్ వర్ష - ఇమ్మాన్యుయేల్ ప్రేమ కథలపైనా ఇలా స్పందించారు. 'జబర్దస్త్ వేదికపై మరో ప్రమాదకరమైన ఘట్టం సుడిగాలి సుధీర్. ఈయనదొక డైలాగ్ ఉంది. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు కానీ, నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఆయన చచ్చిపోవడం దేవుడు ఎరుగు. కనీసం జబర్దస్త్ కు వచ్చిపోవడం కూడా లేదు. ఇక్కడ రష్మీ గౌతమ్ ఒంటరైంది. అక్కడ సుధీర్ అమ్మాయిలో పాడుకుంటున్నాడు. చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు.
ఇక సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌ల లవ్ ట్రాక్ చూసి పుట్టికొచ్చిన రైల్వే ట్రాక్ ఇది. వారి నుంచే వర్ష - ఇమ్మాన్యుయేల్ కథ మొదలైంది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత వర్షను నేనే ఈటీవీకి పరిచయం చేశా. కానీ ఆమె ఇమ్మాన్యుయేల్ తో లింక్ పెట్టుకొని వాళ్లే వైరస్ గా ఈటీవీకి పరిచయం అయ్యారు.' అని జబర్దస్త్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్టిస్ట్ ల మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కామెడీ రూపకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు.


Click it and Unblock the Notifications











